Home /News /sports /

PAK VS WI WEST INDIES PLAYERS USES MASKS IN 3RD ODI TO SAVE FROM DUST STORM IN MUTAN PICS GOES VIRAL SRD

PAK vs WI : మాస్క్‌లు ధరించి బరిలోకి దిగిన విండీస్ ప్లేయర్స్.. కారణం కరోనా మాత్రం కాదు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

PAK vs WI : పాకిస్థాన్.. సొంతగడ్డపై రెచ్చిపోతుంది. విండీస్ వరుసగా మూడు వన్డేల్లో విజయం సొంతం చేసుకుని.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలో భాగంగా విండీస్ ఆటగాళ్లు.. మాస్కులతో బరిలోకి దిగారు.

    సొంతగడ్డపై పాకిస్తాన్(Pakistan) విజయవిహారం కొనసాగుతోంది. విండీస్ తో జరుగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ (PAK vs WI) ను క్లీన్ స్వీప్ చేసింది దాయాది దేశం. ముల్తాన్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో 53 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసి 3-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో వన్డేలో వెస్టిండీస్ ఆటగాళ్లు (West Indies Players) మాస్క్‌లు ధరించి మైదానంలోకి దిగారు. కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ మాస్కులు ధరించలేదు. అందుకు వేరే కారణం ఉంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 33 ఓవర్ల తర్వాత మ్యాచ్ రద్దయింది. ముల్తాన్‌ (Multan)లో ఈదురుగాలులు వీయడంతో వెస్టిండీస్ ఆటగాళ్లు మాస్క్‌లు ధరించారు. ఈదురుగాలులు వీయడంతో మ్యాచ్‌ను కొంతసేపు నిలిపివేయాల్సి వచ్చింది.

    ఇక, ఈ మ్యాచ్ విషయానికొస్తే.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈదురుగాలులు వీయడంతో మ్యాచును 48 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత పాకిస్తాన్ 48 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. పాకిస్థాన్ నుంచి ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన షాదాబ్ ఖాన్(Shadab Khan) 86 పరుగులతో అద్భుతంగా రాణించి తన జట్టుకు ఫైటింగ్ టోటల్ అందించాడు. ఇమామ్ ఉల్ హక్ 62 పరుగులతో రాణించాడు.



    ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. కిమో పాల్ 2, జాడెన్ సిల్స్, హేడెన్ వాల్ష్, అకిల్ హుస్సేన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత 270 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ మరోసారి నిరాశపర్చింది. ఆ జట్టు బ్యాటర్లు మరోసారి చేతులేత్తేయడంతో 216 పరుగులకే ఆలౌటైంది.


    దీంతో.. డీఎల్ఎస్ మెథడ్ లో విండీస్ పై పాక్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖర్లో అఖిల్ హుస్సేన్(37 బంతుల్లో 60 పరుగులు ; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా.. మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో ఆ జట్టు మరోసారి ఘోర ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు.బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దుమ్మురేపిన షాదాబ్ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్ అసాంతం రాణించిన పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Babar Azam, Cricket, Pakistan, West Indies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు