PAK vs WI : చూస్తుంటే పాకిస్తాన్ (Pakistan) క్రికెటర్ బాబర్ ఆజమ్ (Babar Azam)కు క్రికెట్ రూల్స్ బుక్ లోని నిబంధనలపై కొంచెం కూడా అవగాహన లేనట్లుంది. మ్యాచ్ మధ్యలో ఐసీసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. గతంలోనూ తన సోదరుడిని అనుమతిలేకుండానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)కు చెందిన హై పర్ఫామెన్స్ సెంటర్ లో క్రికెట్ ప్రాక్టీస్ చేయించి బోర్డు చేత చివాట్లు కూడా తిన్నాడు. ఆ సమయంలో ఆజమ్ కెప్టెన్సీపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే పీసీబీ మాత్రం కేవలం మందలింపుతో బాబర్ ఆజమ్ ను వదిలేసింది. ఇక తాజాగా బాబర్ ఆజమ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి రికార్డ్ బ్రేక్ చేసి కాదు.. పరువు పోగొట్టుకునే పని చేసి వార్తల్లో నిలిచాడు. శుక్రవారం వెస్టిండీస్, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా బాబర్ ఆజమ్ క్రికెట్ రూల్స్ బుక్ లోని ఒక నిబంధనను అతిక్రమించాడు.
వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ చేసే సమయంలో 29వ ఓవర్ తొలి బంతికి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో వికెట్ల వెనుక ఉన్న బాబర్ రిజ్వాన్ కీపింగ్ గ్లౌవ్ ను వేసుకుని ఫీల్డింగ్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన అంపైర్లు వెంటనే వెస్టిండీస్ జట్టు స్కోరు బోర్డుకు ఐదు పరుగులను జోడించారు.
లా ఆఫ్ క్రికెట్ లోని 28.1 నిబంధన ప్రకారం వికెట్ కీపర్ మినహా వేరే ఇతర ప్లేయర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చేతులకు గ్లౌవ్ వేసుకోరాదు. అలా చేస్తే అది నిబంధనలను అతిక్రమించినట్లే. ఇంత చిన్న విషయాన్ని బాబర్ ఎలా మరిచిపోయాడో అర్థం కావట్లేదని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
A rare thing happened tonight. West Indies were awarded 5 penalty runs due to illegal fielding by Pakistan.
Laws of cricket:
28.1 - No fielder other than the wicket-keeper shall be permitted to wear gloves or external leg guard.#PAKvsWI #BabarAzam???? pic.twitter.com/poTaQ8vskN
— Hamza Ijaz (@HamzaEjaz367) June 10, 2022
ఇక ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టుపై 120 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 275 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (77), ఇమామ్ ఉల్ హక్ (72) రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 32.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ నవాజ్ 4 వికెట్లు, మొహమ్మద్ వసీమ్ 3 వికెట్లతో విండీస్ కు కళ్లెం వేశారు. తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. చివరి వన్డే రేపు జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, India vs South Africa, Pakistan army, Rohit sharma, South Africa, Team India, Virat kohli, West Indies