PAK vs SL : ఆసియా కప్ (Asia Cup) 2022లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దుబాయ్ (Dubai) వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక (Sri Lanka), పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్ (Pakistan) బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఛేదనకు దిగగా.. తొలి ఓవర్ ను వేయడానికి మధుశంక వచ్చాడు. తొలి బంతిని నో బాల్ వేశాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు వైడ్ లను వేశాడు. ఇందులో ఒకటి కీపర్ కు దూరంగా బౌండరీకి చేరింది. దాంతో ఒక్క బంతి ఇవ్వకుండానే మధశంక ఏకంగా 9 రన్స్ ఇచ్చాడు. ఇక ఆరో బంతిని కరెక్ట్ గా వేయగా దానికి రిజ్వాన్ సింగిల్ తీశాడు. ఫలితంగా ఒక్క బంతికి 10 రన్స్ ఇచ్చినట్లు అయ్యింది. ఇక ఈ ఓవర్ లో మధుశంక ఏకంగా 11 బంతులను వేయడం విశేషం.
శ్రీలంక (Sri Lanka) బ్యాటర్ భానుక రాజపక్స (Bhanuka Rajapaksa) వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించాడు. 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ శ్రీలంకను తన పట్టుదలతో ఆదుకున్నాడు. కష్టసమయంలో క్రీజులోకి వచ్చిన రాజపక్స 45 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. ఫలితంగా శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసింది. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఫలితంగా శ్రీలంక పాక్ ముందు భారీ స్కోరును ఉంచింది. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు తీశాడు.
11-ball over by Madushanka! Youngster feeling the heat of final ????#SLvPAK #AsiaCup2022Final pic.twitter.com/k65RBeUamI
— Cricket Pakistan (@cricketpakcompk) September 11, 2022
ఫైనల్లో కీలకమైన టాస్ ను ఓడిపోయిన శ్రీలంక బ్యాటింగ్ కు వచ్చింది. తొలి ఓవర్ మూడో బంతికే ఫామ్ లో ఉన్న కుశాల్ మెండీస్ (0)ను నసీం షా క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే నిసంక (8), ధనుష్క గుణతిలక (1)లను హరీస్ రవూఫ్ పెవిలియన్ కు పంపాడు. ఉన్నంతసేపు బాగానే ఆడిన ధనంజయ డిసిల్వా (28)ని ఇఫ్తికర్ అహ్మద్ అవుట్ చేశాడు. అనంతరం కెప్టెన్ షనక (1) షాదబ్ ఖాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దాంతో శ్రీలంక 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హసరంగతో కలిసి రాజపక్స జట్టును నడిపించాడు. 10 ఓవర్లలో కేవలం 67 పరుగులే చేసిన శ్రీలంక ఆ తర్వాత ధాటిగా ఆడింది. ముఖ్యంగా హసరంగా సిక్సర్ల బౌండరీల వర్షం కురిపించాడు. వీరు ఆరో వికెట్ కు 58 పరుగులు జోడించారు. భారీ షాట్ కు ప్రయత్నించిన హసరంగా కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఇక్కడి నుంచి రాజపక్స భారీ షాట్లు ఆడటం మొదలు పెట్టాడు. 46 పరుగుల వద్ద షాదబ్ ఖాన్ సులభమైన క్యాచ్ ను జారవిడవడంతో బతికిపోయిన రాజపక్స అనంతరం అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక నసీం షా వేసిన ఆఖరి ఓవర్లో ఫోర్, సిక్సర్ తో శ్రీలంక ఇన్నింగ్స్ ను ముగించాడు. గుణతిలక (14 నాటౌట్) రాజపక్సకు చక్కటి సహకారం అందించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asia Cup 2022, Babar Azam, Pakistan, Sri Lanka