హోమ్ /వార్తలు /క్రీడలు /

Asia Cup 2022 Final : శ్రీలంక, పాక్ ఫైనల్ ఫైట్.. అండర్ డాగ్ గా లంక.. రెండు మార్పులతో పాక్.. తుది జట్లు ఇవే

Asia Cup 2022 Final : శ్రీలంక, పాక్ ఫైనల్ ఫైట్.. అండర్ డాగ్ గా లంక.. రెండు మార్పులతో పాక్.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

Asia Cup 2022 Final - Pakistan vs Sri Lanka Final: ఆసియా కప్ (Asia cup) 2022 ఆఖరి అంకానికి చేరుకుంది. దుబాయ్ (Dubai) వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో ఆసియా కప్ టైటిల్ కోసం శ్రీలంక (Sri Lanka), పాకిస్తాన్ (Pakistan) జట్లు తలపడనున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asia Cup 2022 Final - Pakistan vs Sri Lanka Final: ఆసియా కప్ (Asia cup) 2022 ఆఖరి అంకానికి చేరుకుంది. దుబాయ్ (Dubai) వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో ఆసియా కప్ టైటిల్ కోసం శ్రీలంక (Sri Lanka), పాకిస్తాన్ (Pakistan) జట్లు తలపడనున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన  శ్రీలంక వరుసగా విజయాలు సాధిస్తూ ఫైనల్ కు చేరుకుంది. అదే సమయంలో సూపర్ 4లో కిందా మీదా పడుతూ విజయాలను నమోదు చేసిన పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ పై అతి కష్టం మీద గెలిచి ఫైనల్ కు చేరుకుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన సూపర్ 4 ఆఖరి మ్యాచ్ లో శ్రీలంక 5 వికెట్లతో నెగ్గి ఫైనల్ కు ముందు అత్మవిశ్వాసాన్ని సాధించింది.

మార్పులు లేకుండా

ఇక ఈ మ్యాచ్ కోసం శ్రీలంక మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో ఫామ్ లో లేని అసలంక.. అసిత ఫెర్నాండోలను తప్పించి ధనుంజయ డిసిల్వా, మధుషాన్ లను తుది జట్టులోకి తీసుకుంది. వీరిద్దరు ఆ మ్యాచ్ లో ఫర్వాలేదనిపించారు. ఓపెనర్లుగా కుశాల్ మెండీస్, నిస్సాంక సూపర్ ఫామ్ లో ఉన్నారు. గుణతిలక, రాజపక్స, దాసున్ షనకలతో బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. కరుణరత్నే, హసరంగలు అటు బంతితో ఇటు బ్యాట్ తో మ్యాజిక్ చేయగల సమర్ధులు. ఇక బౌలింగ్ లో మధుశంక, మధుషాన్ లతో పాటు మహీశ్ తీక్షణ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ బట్టి చూస్తే శ్రీలంక ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.

రెండు మార్పులతో

గత మ్యాచ్ లో రెస్ట్ తీసుకున్న నసీం షా, షాదబ్ ఖాన్ లు తిరిగి జట్టులోకి రానున్నారు. అయితే పాకిస్తాన్ ను బ్యాటింగ్ ఇబ్బంది పెడుతుంది. రిజ్వాన్ మినహా నమ్మకంగా బ్యాటింగ్ చేసే ప్లేయర్ కరువయ్యాడు. ఆసియా కప్ ముందు వరకు కూడా సూపర్ ఫామ్ లో ఉన్న బాబర్ ఆజమ్ పేలవ ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. అయితే శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో 30 పరుగులు సాధించడంతో టచ్ లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు. ఫఖర్ జమాన్, ఇఫ్తికర్, ఖుష్దిల్ లు ధాటిగా ఆడలేకపోతున్నారు. శ్రీలంకపై గెలవాలంటే రిజ్వాన్, బాబర్ ఆజమ్ లతో పాటు నవాజ్, షాదబ్ ఖాన్, నసీం షా, రావూఫ్ రాణించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : సెహ్వాగ్ చెప్పినట్లే జరుగుతుందిగా.. అలా అయితే ఆసియా కప్ ఫైనల్లో గెలిచేది ఆ జట్టేనా?

టాస్ కీలకం

దుబాయ్ లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే దాదాపుగా గెలుస్తూ వస్తోంది. దాంతో మరోసారి టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. ఇప్పటి వరకు ఆసియా కప్ 14 సార్లు జరిగితే అందులో శ్రీలంక 5 సార్లు నెగ్గింది. పాకిస్తాన్ 2 సార్లు గెలిచింది. అత్యధికంగా భారత్ 7 సార్లు నెగ్గింది.

ముఖాముఖి

టి20ల్లో ఇరుజట్లు ఇప్పటి వరకు 22 సార్లు తలపడ్డాయి. అందులో పాకిస్తాన్ 13 సార్లు నెగ్గితే.. శ్రీలంక 9 సార్లు గెలిచింది. చివరి సారిగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 5 వికెట్లతో నెగ్గింది.

తుది జట్లు (అంచనా)

శ్రీలంక

షనక (కెప్టెన్), నిసాంక, కుశాల్, గుణతిలక, ధనంజయ, కరుణరత్నే, భానుక రాజపక్స, హసరంగ, తీక్షణ, మదుశంక, మదుషాన్

పాకిస్తాన్

బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్, షాదాబ్, ఖుష్దిల్, నవాజ్, అసిఫ్ అలీ, రావూఫ్, హస్నైన్, నసీం షా

First published:

Tags: Asia Cup 2022, Babar Azam, India vs australia, India VS Pakistan, India vs srilanka, Pakistan, Sri Lanka, Team India

ఉత్తమ కథలు