PAK vs SL 1st Test : దివంగత ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (Shane Warne) టెస్టు క్రికెట్ లో నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. జూన్ 4, 1993న ఇంగ్లండ్ (England) బ్యాటర్ మైక్ గాటింగ్ ను అవుట్ చేసిన బంతిని ఎవరూ మరిచిపోరు. ఆ బంతి ’బాల్ ఆఫ్ ద సెంచరీ‘గా నిలిచిపోయింది. ఎక్కోడో లెగ్ స్టంప్ కు అవుట్ సైడ్ వేసిన బంతి అనూహ్యంగా టర్న్ అవుతూ ఆఫ్ స్టంప్ వికెట్ను ఎగరగొట్టి.. క్రీజులో ఉన్న మైక్ గాటింగ్ తో సహా ఇతర ప్లేయర్లను వార్న్ ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు. గాటింగ్ అవుటైన విధానాన్ని ఎప్పుడు చూసినా ఒళ్లు పులకరిస్తుంది. తాజాగా అటువంటి బంతినే పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా వేశాడు. అంతేకాదు ఆ బంతికి ప్రత్యర్థి బ్యాటర్ ను క్లీన్ బౌల్డ్ కూడా చేశాడు.
ఇది కూడా చదవండి : విరాట్ కోహ్లీ ఫామ్ పై కీలక కామెంట్స్ చేసిన దినేశ్ కార్తీక్.. ఏమన్నాడంటే?
ప్రస్తుతం గాలె వేదికగా శ్రీలంక, పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ టెస్టులో భాగంగా యాసిర్ షా అచ్చం వార్న్ ను పోలిన ’బాల్ ఆఫ్ ద సెంచరీ‘ బంతిని వేశాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో కుశాల్ మెండీస్ 76 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో యాసిర్ షా 56వ ఓవర్ వేయడానికి వచ్చాడు. తొలి బంతిని లెగ్ స్టంప్ కు దూరంగా వేశాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్ అవుతూ.. కుశాల్ మెండీస్ ను బీట్ చేసి ఆఫ్ స్టంప్ వికెట్ ను గిరాటేసింది. అంతే.. పాకిస్తాన్ ప్లేయర్లు సంబరాల్లో మునిగిపోయారు. ఇక కుశాల్ మెండీస్ అయితే ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో క్రీజులో అలానే కాసేపు ఉండిపోయాడు. ఇక ఈ బంతితో యాసిర్ షా బాల్ ఆఫ్ ది సెంచరీ కంటెండర్ లిస్టులో ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Ball of the Century candidate❓
Yasir Shah stunned Kusal Mendis with a stunning delivery which reminded the viewers of Shane Warne’s ‘Ball of the Century’.#SLvPAK pic.twitter.com/uMPcua7M5E
— Sri Lanka Cricket ???????? (@OfficialSLC) July 18, 2022
The greatest Test delivery ever? pic.twitter.com/MQ8n9Vk3aI
— cricket.com.au (@cricketcomau) March 4, 2022
ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 222 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 75 ఓవర్లలో 2 వికెట్లకు 199 పరుగులు చేసింది. పాకిస్తాన్ విజయ సాధించాలంటే మరో 143 పరుగులు చేయాల్సి ఉంది. ఆటకు రేపు చివరి రోజు. ప్రస్తుతం క్రీజులో అబ్దుల్లా షఫీక్ (103 బ్యాటింగ్), బాబర్ ఆజమ్ (52 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, Hardik Pandya, India Vs Westindies, Pakistan, Rohit sharma, Shikhar Dhawan, Sri Lanka, Team India