• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • PAK VS SA DEBUTANT NAUMAN ALIS FIVE FOR ON DEBUT BREAKS 71 YEAR OLD RECORD SRD

PAK vs SA : 71 ఏళ్ల రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన పాకిస్థాన్ స్పిన్నర్ నౌమన్ అలీ

Nauman Ali

Pak vs Sa : పాకిస్తాన్‌ అరంగేట్ర క్రికెటర్‌ నౌమన్‌ అలీ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాక్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా నిలిచాడు. అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన పాకిస్తాన్‌ నాలుగో స్పిన్నర్‌గా..ఓవరాల్ గా

  • Share this:
    పాకిస్తాన్‌ అరంగేట్ర క్రికెటర్‌ నౌమన్‌ అలీ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాక్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా నిలిచాడు. అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన పాకిస్తాన్‌ నాలుగో స్పిన్నర్‌గా..ఓవరాల్ గా 12 వ బౌలర్ గా ఘనతకెక్కాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో నౌమన్‌ అలీ ఈ ఘనతను అందుకున్నాడు. పదునైన బంతులతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించి జట్టు విజయానికి బాటలు వేశాడు. నౌమన్ అలీ(5/35) ధాటికీ సఫారీ రెండో ఇన్నింగ్స్‌లో విలవిలాడింది.ఇక లేటు వయసులో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన నౌమన్ అలీ.. వయసు ఒక అంకె మాత్రమేనని నిరూపించాడు. 34ఏళ్ల వయసులో సుదీర్ఘ ఫార్మాట్‌ను ప్రారంభించి ఫస్ట్ మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. తద్వారా 71 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఓల్డెస్ట్ అరంగేట్ర క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 34 ఏళ్ల 114 రోజుల లేటు వయసులో నౌమన్ ఈ ఫీట్ సాధించాడు. అంతేకాకుండా ఓల్డెస్ట్ అరంగేట్ర స్పిన్నర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్‌కు చెందిన మిరన్ బక్ష్(47 ఏళ్ల 284 రోజులు), జుల్ఫికర్ బాబర్(34 ఏళ్ల 308 రోజులు), మహ్మద్ అస్లామ్(34 ఏళ్ల 177 రోజులు) ఓల్డెస్ట్ క్రికెటర్ల జాబితాలో టాప్-3లో ఉన్నారు.

    ఈ నేపథ్యంలో ఐసీసీ అతడి ప్రతిభను కొనియాడుతూ ఓ వీడియోను షేర్‌ చేసింది. అయితే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆటలో భాగంగా నౌమన్‌ అలీ ఈ రికార్డు నమోదు చేశాడు. పదునైన బంతులతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.


    నౌమన్ అలీ(5/35), యాసిర్ షా(4/75) ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు కుప్పకూలింది. హసన్ అలీకి ఓ వికెట్ దక్కింది. ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (74), వాన్‌ డెర్‌ డస్సెన్‌ (64) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని పాక్ ముందు 90 పరుగుల లక్ష్యం నమోదవ్వగా.. ఆ జట్టు ఆడుతు పాడుతూ చేధించింది. 22.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి 7 వికెట్లతో ఘన విజయాన్నందుకుంది. అన్రిచ్ నోర్జ్ రెండు, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీయగా.. బాబర్ ఆజమ్(30) రాణించాడు.
    Published by:Sridhar Reddy
    First published: