• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • PAK VS SA AMAZING FILEDING EFFORT BY PAKISTAN WICKET KEEPER MOHAMMAD RIZWAN WATCH VIDEO SRD

PAK vs SA : సూపర్ రనౌట్.. పాకిస్థాన్ వికెట్ కీపర్ సూపర్ మ్యాన్ ఫీట్..వైరల్ వీడియో

Photo Credit : Twitter

PAK vs SA : అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాంటి విన్యాసమే పాకిస్థాన్, సౌతాఫ్రికాల ఫస్ట్ టెస్ట్ లో జరిగింది.

  • Share this:
    అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాంటి విన్యాసమే పాకిస్థాన్, సౌతాఫ్రికాల ఫస్ట్ టెస్ట్ లో జరిగింది. పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ చేసిన సూపర్ రనౌట్ ఇప్పుడు వైరల్ గా మారింది. రిజ్వాన్ సూపర్ మ్యాన్ ఫీట్ కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకెళితే.. పాకిస్థాన్, సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండు టెస్ట్ ల సిరీస్ లో సఫారీ బ్యాట్స్ మన్ వాన్ డర్ డస్సెన్ ను సూపర్ రనౌట్ తో పెవిలియన్ కు పంపాడు రిజ్వాన్. 17 పరుగులతో మంచి టచ్ లో కన్పించిన డస్సెన్.. అనవసరపు సింగిల్ కు ప్రయత్నించాడు. కవర్స్ లో సింగిల్ కు ప్రయత్నించగా బంతిని బాబర్ అజామ్ నేరుగా రిజ్వాన్ కి విసిరాడు. వెంటనే బంతిని అందుకున్న రిజ్వాన్ అద్భుతంగా డైవ్ చేసి వికెట్లను గిరాటేశాడు. ఇప్పుడు ఈ రనౌట్ వైరల్ గా మారింది. ఈ వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షేర్ చేసింది. ఇక దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా జట్టు పాకిస్థాన్‌ గడ్డపై అడుగుపెట్టింది. సఫారీ ఆటగాళ్లకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇవాల్టి నుంచి ప్రారంభమైన సిరీస్ లో ఇరుజట్లు రెండు టెస్టులు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి.

    దక్షిణాఫ్రికా చివరిసారిగా 2007లో పాకిస్తాన్‌లో పర్యటించింది. 2009లో పాక్‌లో శ్రీలంక క్రికెటర్లు ఉన్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఉగ్రదాడి కారణంగా ఆ దేశంలో పర్యటించేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. దీంతో స్వదేశంలో ఆడాల్సిన సిరీస్‌లను తటస్థ వేదికైన యూఏఈలో పాక్‌ ఆడుతూ వస్తున్నది. ఎలాగైన తమ దేశంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ పునరుద్ధరించాలని పట్టుదలతో ఉన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అగ్రశ్రేణి జట్లను తమ దేశ పర్యటనకు ఆహ్వానిస్తోంది.


    మరోవైపు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టును కట్టడి చేస్తున్నారు పాకిస్థాన్ బౌలర్లు. 150 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా టీమ్. ఓపెనర్ ఎల్గర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం క్రీజులో బవుమా, జార్జ్ లిండే ఉన్నారు.
    Published by:Sridhar Reddy
    First published: