హోమ్ /వార్తలు /క్రీడలు /

PAK vs ENG : నాలుగు సెంచరీలు.. 506 పరుగులు.. ఒకే ఒక్క రోజులో విధ్వంసం.. పాపం, పాకిస్తాన్..

PAK vs ENG : నాలుగు సెంచరీలు.. 506 పరుగులు.. ఒకే ఒక్క రోజులో విధ్వంసం.. పాపం, పాకిస్తాన్..

PC : England Twitter

PC : England Twitter

PAK vs ENG : 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ (Pakistan) గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ (England) జట్టు విధ్వంసం సృష్టించింది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పరుగుల వరద పారించారు ఇంగ్లీష్ ఆటగాళ్లు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ (Pakistan) గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ (England) జట్టు విధ్వంసం సృష్టించింది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పరుగుల వరద పారించారు ఇంగ్లీష్ ఆటగాళ్లు. వారి ధాటికి పాకిస్తాన్ బౌలర్లు పట్టపగలే చుక్కలు చూశారు. టెస్ట్ క్రికెట్ అని మర్చిపోయి.. మరి పోటీ పడి పరుగులు చేశారు. తొలి రోజు వెలుతురు కారణంగా 75 ఓవర్ల ఆట మాత్రం సాధ్యం అయింది. లేకపోతే.. మరిన్ని పరుగులు సాధించి ఉండేది ఇంగ్లండ్. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 75 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది స్టోక్స్ సేన. జాక్ క్రాలీ (111 బంతుల్లో 122 పరుగులు ; 21 ఫోర్లు), డకెట్ (110 బంతుల్లో 107 పరుగులు ; 15 ఫోర్లు), ఓలి పోప్ (104 బంతుల్లో 108 పరుగులు ; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 పరుగులు నాటౌట్ ; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో వీరవీహారం చేశారు.

ఆట ముగిసే సమయానికి ప్రస్తుతం క్రీజులో హ్యారీ బ్రూక్ (101 పరుగులు నాటౌట్), బెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34 పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు, 1 సిక్సర్) ఉన్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (23 పరుగులు) మాత్రమే తక్కువ స్కోరుకు పరిమితమయ్యాడు. మిగతా బ్యాటర్లు మాత్రం పాక్ బౌలర్లకు చుక్కలు చూపారు. పాక్ బౌలర్లలో జహిద్ మహ్మద్ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ అలీ, హారీస్ రౌవూఫ్ చెరో వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు ఆది నుంచే అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ, డకెట్ లు వన్డే తరహాలో తమ బ్యాటింగ్ కొనసాగించారు. ఈ ఇద్దరి సెంచరీలతో ఫస్ట్ వికెట్ కు 233 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇద్దరి సెంచరీల చేసిన తర్వాత వరుసగా ఔటయ్యారు. దీంతో.. 235 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. ఆ తర్వాత ఓలీ పోప్, జో రూట్ కాసేపు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు.

అయితే.. రూట్ జహిద్ మహ్మద్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే.. నాలుగో వికెట్ కు 176 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు పోప్, హ్యారీ బ్రూక్. ముఖ్యంగా బ్రూక్ పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. షకీల్ వేసిన ఒక ఓవర్ లో వరుసగా ఆరు ఫోర్లు బాది 24 పరుగులు పిండుకున్నాడు. ఇక.. ఓలీ పోప్ ఔటైనా.. స్టోక్స్ వచ్చి రావడంతోనే మెరుపు బ్యాటింగ్ చేశాడు. అయితే, వెలుతురు సహకరించకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు.

చివరిసారిగా ఇంగ్లండ్ 2005లో పాకిస్తాన్ లో టెస్టు సిరీస్ ను ఆడింది. ఆ తర్వాత మళ్లీ ఆ దేశంలో కాలు పెట్టలేదు. ఇక టి20 ప్రపంచకప్ కు ముందు 7 మ్యాచ్ ల టి20 సిరీస్ కోసం పాక్ లో ఇంగ్లండ్ అడుగుపెట్టింది. ఇక 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడ ల్యాండ్ అయ్యింది.గతేడాది పాకిస్తాన్ లో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే సెక్యూరిటీ కారణాలతో తమ పర్యటనను రద్దు చేసుకుని పాక్ ను విడిచింది. దాంతో ఇంగ్లండ్ తన పర్యటనను వాయిదా వేసుకుంది.

First published:

Tags: Babar Azam, Cricket, England, Pakistan, Test Cricket

ఉత్తమ కథలు