Hardik Pandya : టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యను చూసి నేర్చుకోండి.. తమ దేశ ఆటగాళ్ల పై పాక్ మాజీ ఆటగాడు ఫైర్

danish kaneria on hardik (పైల్ ఫోటో)

Hardik Pandya : భారత క్రికెట్ లో హిట్టర్ Hardik Pandya మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఈసారి కళ్లు చెదిరే ఇన్నింగ్స్ తో కాదు.. అతని త్యాగ గుణానికి ప్రశంసలు అందుతూనే ఉన్నాయ్. ఈ టీమిండియా ఆల్ రౌండర్ త్యాగ గుణానికి పాక్ మాజీ ప్లేయర్ డానిష్ కనేరియా ఫిదా అయ్యాడు. అంతటితో ఆగకుండా హార్దిక్ ను పొగుడుతూ.. పాక్ ఆటగాళ్ల పై ఫైరయ్యాడు.

 • Share this:
  ఆస్ట్రేలియా టీ-20 సిరీస్ లో హార్దిక్ చూపిన క్రీడా స్ఫూర్తికి క్రీడాభిమానులే కాదు.. నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. హర్థిక్ ది గొప్ప మనసు అని అభినందనలు తెలుపుతున్నారు. యువ క్రికెటర్ ను ప్రోత్సహిస్తున్న పాండ్యా ను చూసి.. అభిమానులు త్యాగమూర్తివయ్యా.. అంటూ కీర్తిస్తున్నారు. ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్ ను 2-1 తో గెలుచుకుంది టీమిండియా. వన్డేలో కంగారూల చేతిలో చతికిలపడిన దానికి బదులు తీర్చుకుంది. కాగా, మూడో టీ 20 మ్యాచ్ ముగిసి.. అవార్డుల ఫంక్షన్ కూడా అయిపోయింది. టీ 20 సిరీస్ లో బ్యాటింగ్ లో అద్భుత ప్రతిభ చూపడమే కాకుండా.. రెండో టీ 20 లో భారత్ ను విజయ తీరాలకు చేర్చినందుకు గానూ హార్థిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా దక్కింది. కానీ అతడు దానిని తన సహచర ఆటగాడు నటరాజన్ కు ఇచ్చేశాడు. అప్పుడు హార్ధిక్ చేసిన పనికి అందరూ ముగ్దులయ్యారు. యంగ్ ఆటగాళ్లను ప్రొత్సాహించడంలో హార్దిక్ గొప్ప మనస్సు చాటుకున్నాడని అందరు ప్రశంసించారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో పాక్ మాజీ క్రికెటర్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా చేరాడు.

  హార్దిక్, నటరాజన్ ల పిక్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన డానిష్ కనేరియా పాండ్యాను ప్రశంసల్లో ముంచెత్తాడు. " ఒక యువ ఆటగాణ్నికి ఇంతకంటే ప్రతిఫలం అవసరం లేదు. తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను యువ ఆటగాడికి ఇవ్వడంతో హార్దిక్ మనస్సులను గెలిచాడు. ఇంతకన్నా ఆ ప్లేయర్ కి ఏ మోటివేషన్ అవసరం లేదు " అని పాండ్యాను కొనియాడాడు. అంతటితో ఆగకుండా తమ దేశ ఆటగాళ్లపై కూడా ఫైరయ్యాడు దినేష్ కనేరియా. తమ జట్టులోని ఏ ప్లేయర్ కూడా ఇలా చేయలేదని తెలిపాడు. అసలు తమ ఆటగాళ్లకి ఆ ఆలోచన కూడా రాదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఈ పాక్ మాజీ లెగ్ స్పిన్నర్.


  ఈ పాక్ మాజీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ (2009) సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు స్పిన్నర్ డానిష్ కనేరియాపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జీవిత కాల నిషేధం విధించారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విధించిన బహిష్కరణపై కనేరియా చేసుకున్న అప్పీల్‌ పీసీబీ తిరస్కరించి నిషేధాన్ని సమర్థించింది. క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో కనేరియా ఎలాంటి జోక్యం చేసుకోకుండా జీవిత కాలంపాటు బహిష్కరించామని పీసీబీ 2009లో ప్రకటించింది. అయితే ఈ కేసులో ఆది నుంచీ పీసీబీ తనకు ఎలాంటి సహకారం అందించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని బలిపశువును చేసిందని లెగ్ స్పిన్నర్‌ కనేరియా అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువును కావడం వల్లే తమ దేశ క్రికెట్ బోర్డు సాయం చేయలేదని బహిరంగానే విమర్శలు గుప్పించారు. కాగా అతను 61 టెస్టుల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించి 261 వికెట్లు పడగొట్టాడు.
  Published by:Sridhar Reddy
  First published: