గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.మొత్తం 128 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. వీరిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. ఇక, క్రీడారంగంలో 9 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో పారాఒలింపిక్ అథ్లెట్ దేవేంద్ర ఝఝారియా (Devendra Jhajharia) భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యాడు.
ఇక, గతేడాది ఆగస్టులో జపాన్ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో 130 కోట్ల భారతీయుల స్వర్ణ కాంక్ష తీర్చిన నీరజ్ చోప్రాకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాను పద్మశ్రీ వరిచింది. నీరజ్ చోప్రాకు పద్మశ్రీతో పాటు ‘పరమ విశిష్ట సేవా పతకం’తో సత్కరించనుంది కేంద్ర ప్రభుత్వం. మిగతావారిలో సుమిత్ అంటిల్(పారాఅథ్లెట్), ప్రమోద్ భగత్(షూటింగ్), శంకర్‌నారాయణ్ మీనన్, ఫసల్‌అలీ దార్, వందన కటారియా(హాకీ), అవనీ లేఖరా(షూటింగ్), బ్రహ్మానంద్ సంక్‌వాల్కర్లను కూడా పద్మశ్రీ వరించింది.
Govt announces Padma Awards 2022 CDS Gen Bipin Rawat to get Padma Vibhushan (posthumous), Congress leader Ghulam Nabi Azad to be conferred with Padma Bhushan pic.twitter.com/Qafo6yiDy5
— ANI (@ANI) January 25, 2022
దేవేంద్ర ఝఝారియా రాజస్తాన్ కు చెందిన ఒక క్రీడాకారుడు. ఇతను పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరపున వ్యక్తిగతంగా రెండు స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డు సాధించాడు. ఇతను 2004 ఏథెన్స్ పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోలో మొదటి బంగారు పతకం గెలవగా, 2016 రియో పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోలో రెండవ బంగారు పతకం గెలిచాడు.ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో దేవేంద్ర ఝఝారియా రజత పతకం గెలిచాడు.
ఇక, భారత ఒలింపిక్ చరిత్రలో స్వర్ణ పతకం గెలిచిన రెండో (ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అయితే తొలి భారతీయుడు) భారతీయుడిగా చోప్రా రికార్డులకెక్కాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ లో భాగంగా వ్యక్తిగత విభాగంలో షూటర్ అభినవ్ బింద్రా మాత్రమే గతంలో స్వర్ణాన్ని నెగ్గాడు. ఆ తర్వాత పసిడి నెగ్గిన క్రీడాకారులు నీరజ్ చోప్రానే. భారత సైనికదళంలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న నీరజ్ చోప్రా.. ప్రస్తుతం ఈ ఏడాది జులై లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ తో పాటు ప్రపంచ ఛాంపియన్షిప్ పై దృష్టి సారించాడు. అనంతరం అతడు 2024 పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.