Home /News /sports /

PADMA AWARDS 2022 INDIAS GOLDEN GIRL AT TOKYO PARALYMPICS AVANI LEKHARA TO BE AWARDED PADMA BHUSHAN GH VB

Padma Awards: షూటర్ అవనీ లేఖరాను వరించిన పద్మశ్రీ పురస్కారం.. ఆమె గురించి మరిన్ని వివరాలు..

షూటర్ అవనీ లేఖరా

షూటర్ అవనీ లేఖరా

పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ పోటీలో స్వర్ణ పతకాన్ని సాధించి కీర్తి గడించిన అవని ఇప్పుడు తన 20 ఏళ్ల ప్రాయంలో మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. తాజాగా ప్రకటించిన పద్మ అవార్డ్స్‌లో ఆమెను పద్మశ్రీ పురస్కారం వరించింది.

అవనీ లేఖరా (Avani Lekhara).. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టోక్యో పారాలింపిక్స్‌ (Tokyo Paralympics) సమయంలో వరల్డ్స్ బెస్ట్ మహిళా షూటర్‌గా అవనీ పేరు మార్మోగింది. 19 ఏళ్లకే ఈ మహిళా అథ్లెట్ టోక్యో పారాలింపిక్స్‌లో ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో దేశానికి తొలి పసిడి పతకం తెచ్చి రికార్డ్ సృష్టించింది. పారాలింపిక్స్‌లో ఒకేసారి రెండు మెడల్స్ సాధించిన భారత వనితగా కూడా అవని తన పేరును చరిత్రలో లిఖించుకుంది. అంతేకాదు, పారాలింపిక్స్‌లో తొలి గోల్డ్ మెడల్ గెలుపొందిన భారత క్రీడాకారిణిగా అవని అవతరించింది. పారాలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ పోటీలో స్వర్ణ పతకాన్ని సాధించి కీర్తి గడించిన అవని ఇప్పుడు తన 20 ఏళ్ల ప్రాయంలో మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. తాజాగా ప్రకటించిన పద్మ అవార్డ్స్‌లో ఆమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. త్వరలోనే ఆమె పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనుంది. టోక్యో గేమ్స్‌లో ఆమె చూపించిన మేటి ఆట ప్రదర్శనకు నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2021లో ఖేల్ రత్న అవార్డు కూడా లభించిన విషయం విదితమే.

Twitter Flock: ట్విట్టర్​లో త్వరలోనే ఇన్​స్టాగ్రామ్​ తరహా ఫీచర్.. ట్విట్టర్​ ఫ్లాక్​ ఎలా పనిచేస్తుందంటే..?


అవనీ లేఖరా 2012లో జరిగిన ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వీల్‌చైర్‌కే పరిమితమైంది. ఈ సమయంలో పుస్తకాలు చదవడానికి అలవాటు పడ్డ ఆమె భారత ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీ అయిన 'ఎ షాట్ ఎట్ హిస్టరీ: మై అబ్సెసివ్ జర్నీ టు ఒలింపిక్ గోల్డ్' చదివింది. ఆ పుస్తకం ఆమెలో కొండంత విశ్వాసాన్ని నింపింది. అప్పుడే షూటింగ్ క్రీడలో పాల్గొనాలని ఆమె నిశ్చయించుకుంది. ఈ విషయంలో ఆమెకు తన తండ్రి ఎంతగానో సహాయపడ్డారు. ఆమె మొదట్లో షూటింగ్, విలువిద్య రెండింటినీ ప్రయత్నించింది. తరువాత షూటింగ్‌ తనకు ఎక్కువ ఆనందాన్ని అందిస్తోందని గమనించింది. అలా షూటింగ్‌పై ఎక్కువ దృష్టి సారించి నైపుణ్యం సాధించింది. తన ప్రతిభతో 19 ఏళ్లకే రెండు మెడల్స్ సాధించి ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపింది.

అవని టోక్యో గేమ్స్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ స్టాండింగ్ SH 1 ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకుంది. వరల్డ్ షూటింగ్ పారా స్పోర్ట్ (WSPS) ప్రపంచ కప్ 2017లో ఆర్2లో జూనియర్ వరల్డ్ రికార్డ్‌తో రజతం... ప్రపంచ కప్ బ్యాంకాక్ 2017లో కాంస్యం... ఒసిజెక్, క్రొయేషియా 2019లో జరిగిన వరల్డ్ షూటింగ్ పారా స్పోర్ట్ ప్రపంచ కప్‌లో రజతం, ప్రపంచ కప్ అల్-ఐన్ 2021లో రజతం... ఇలా అనేక ప్రపంచ కప్ పతకాలను ఆమె గెలుచుకుంది. ఈ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శనతో ఆమె ఫిబ్రవరి 2019లో యూఏఈలో టోక్యో పారాలింపిక్స్ కోటాను సాధించింది.

2017 నుంచి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ట్రైనింగ్ అండ్ కాంపిటీషన్ (ACTC) ద్వారా ఆమెకు ట్రైనింగ్ నిమిత్తం నిధులు సమకూర్చింది భారత ప్రభుత్వం. అలాగే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS)లో చేర్చి అవనికి కావలసిన సపోర్ట్ అందించింది. ఆమె 12 అంతర్జాతీయ పోటీలలో పాల్గొంది. స్పోర్ట్స్ కిట్‌తో పాటు స్పోర్ట్స్ సైన్స్ సపోర్ట్‌తో నేషనల్ కోచింగ్ క్యాంపులకు హాజరయింది. ఆమె ఇంట్లో కంప్యూటరైజ్డ్ డిజిటల్ టార్గెట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ఆర్థిక సహాయం, ఎయిర్ రైఫిల్, మందుగుండు సామగ్రి, ఉపకరణాలను కూడా పొందింది. పారాలింపిక్స్‌లో భారత్ ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలతో సహా 19 పతకాలను గెలుచుకుంది. ఐదు స్వర్ణాల్లో ఒక స్వర్ణం అవని అందించినది కాగా ఆమె పసిడి పతకం సాధించిన తర్వాత తన కల సాకారం అయిందని సంతోషం వ్యక్తం చేసింది.

అవని ప్రొఫైల్

పుట్టిన తేదీ: నవంబర్ 8, 2001

స్వస్థలం: జైపూర్, రాజస్థాన్

క్రీడలు: పారా షూటింగ్

ఈవెంట్‌లు: మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ SH1, మిక్స్‌డ్ 10m ఎయిర్ రైఫిల్ ప్రోన్ SH1, మిక్స్‌డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1, మహిళల 50మీ 3 స్థానం

ట్రైనింగ్ ప్లేస్: JDA షూటింగ్ రేంజ్ జైపూర్, హోమ్ రేంజ్

వ్యక్తిగత కోచ్: షుమా షిరూర్

జాతీయ కోచ్: సుభాష్ రాణా

అంతర్జాతీయ అరంగేట్రం: 2017 యూఏఈలోని అల్ ఐన్‌లో జరిగిన ప్రపంచ కప్‌
Published by:Veera Babu
First published:

Tags: Padma Awards, Sports

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు