PADMA AWARDS 2022 23 YEAR OLD SUMIT ANTIL HONOURED WITH PADMA SHRI AFTER DOMINATING SHOW IN TOKYO PARALYMPICS GH VB
Padma Awards: టోక్యో పారాలింపిక్స్‌లో దుమ్మురేపే ప్రదర్శన.. ఫలితంగా అతనికి వరించిన పద్మశ్రీ..
సుమిత్ (ఫైల్)
భారతదేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుల్లో సుమిత్ అంటిల్(23 ఏళ్లు) ఒకరు. టోక్యో పారాలింప్క్స్లో(Tokyo Paralympics) దుమ్ములేపే ప్రదర్శన చేసిన సుమిత్ అంటిల్(Sumit Antil) దేశం గర్వించదగ్గ విధంగా రాణించాడు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో టోక్యో పారాలింపిక్స్ పతక విజేత సుమిత్ అంటిల్ ఒకరు. అతడిని పద్మశ్రీ పురస్కారం వరించింది. భారతదేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుల్లో సుమిత్ అంటిల్(23 ఏళ్లు) ఒకరు. టోక్యో పారాలింప్క్స్లో(Tokyo Paralympics) దుమ్ములేపే ప్రదర్శన చేసిన సుమిత్ అంటిల్(Sumit Antil) దేశం గర్వించదగ్గ విధంగా రాణించాడు. ఆ ఈవెంట్లో అతను విసిరిన ఆరు త్రోలలో పలు ఫీల్డ్ రికార్డులను నెలకొల్పాడు. అంతేగాక.. తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సైతం ఏకంగా మూడు సార్లు తుడిచిపెట్టాడు. పురుషుల
జావెలిన్ త్రో(F64) విభాగంలో పలు రికార్డులను బ్రేక్(Sumit Antil) చేసి దేశం దృష్టిని ఆకర్షించాడు. మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్కు గాను బంగారు పతకం గెలుచుకున్నాడు. అతడికి 2021లోనే ఖేల్ రత్న అవార్డు సైతం లభించింది. పద్మశ్రీ అవార్డు అందుకున్న అనంతరం భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ట్విట్టర్లో ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశాడు సుమిత్. ఈ పురస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, రాబోయే టోర్నమెంట్లలో దేశం గర్వించేలా తన వంతు ప్రయత్నం చేస్తానంటూ రాసుకొచ్చాడు.
పట్టువదలని విక్రమార్కునిలా..
హర్యానాకు చెందిన సుమిత్ అంటిల్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి వైమానిక దళంలో పనిచేస్తూ 2004లో మరణించాడు. చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న అంటిల్.. రెజ్లర్ కావాలనుకుని శిక్షణ కూడా పొందాడు. కానీ దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 2015 జనవరి 5న ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న అతడు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తరలించగా.. శస్త్రచికిత్స చేసిన వైద్యులు అతని కుడి మోకాలి వరకు తొలగించారు.
53 రోజుల విశ్రాంతి అనంతరం పూణేలోని కృత్రిమ అవయవాల కేంద్రానికి తరలించారు. అక్కడే అతనికి సరిపోయే కృత్రిమ కాలును అమర్చారు. దీనితో రెజ్లర్ కావాలనే తన కలను విడిచిపెట్టాడు. అయితే క్రీడా స్ఫూర్తిని కాపాడుకుంటూ వ్యాయామాలను సాధన చేసేవాడు.
ఈ క్రమంలో తనకు సమీప గ్రామంలో ఉన్న పారా అథ్లెట్ రాజ్‌కుమార్ గురించి, అలాగే.. 2017-జూలై పారాఒలింపిక్స్ గురించి తెలుసుకున్నాడు. 2018నుంచి పారా అథ్లెటిక్స్ సాధనను ప్రారంభించాడు. సందీప్ చౌదరితో కలిసి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ పొందాడు.
విజయాల పరంపర..
సుమిత్ ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించాడు. 2020 పారాలింపిక్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, F64 విభాగంలో ప్రపంచ నం.1 రికార్డ్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్, ఇటలీ 2019లో రజత పతకం, పారిస్ ఓపెన్ హ్యాండీస్పోర్ట్, 2019లో రజత పతకం, ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, దుబాయ్ 2019లో రజత పతకం.. వంటి రికార్డులు అతడి సొంతం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.