పాండ్యా, రాహుల్‌‌ కంటే పెద్ద తప్పులు చేసిన వారు జట్టులో ఉన్నారు:శ్రీశాంత్

మహిళలపై హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు తప్పేనన్న శ్రీశాంత్, వారికంటే పెద్ద తప్పులు చేసిన ఆటగాళ్లు జట్టులో ఆడుతున్నారంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వారిద్దరు జట్టులోకి ఎంట్రీ ఇస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.

news18-telugu
Updated: January 14, 2019, 11:38 PM IST
పాండ్యా, రాహుల్‌‌ కంటే పెద్ద తప్పులు చేసిన వారు జట్టులో ఉన్నారు:శ్రీశాంత్
కాఫీ విత్ కరణ్ షోలో హార్థిక్ పాండ్య, కేఎల్ రాహుల్
news18-telugu
Updated: January 14, 2019, 11:38 PM IST
మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌కు నిషేధిత భారత క్రికెటర్‌ శ్రీశాంత్‌ మద్దతు తెలిపారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ టాక్ షోలో మహిళల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాండ్యా, రాహుల్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండడం తెలిసిందే. తమ వ్యాఖ్యలకు వారిద్దరు ఇప్పటికే క్షమాపణ చెప్పారు. అయినా వివాదం సద్దుమణగడం లేదు. ఈ వివాదం కారణంగా వారిని ఆస్ట్రేలియా టూర్ నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి వెనక్కి తిప్పిపంపారు. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ టూర్‌కు వారిద్దరిని నిషేధించారు. అటు వీరిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో శ్రీశాంత్‌ మీడియా ముందుకు వచ్చి యువ ఆటగాళ్లకు మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడింది తప్పే అయినప్పటికి, పాండ్యా, రాహుల్‌లు మ్యాచ్‌ విన్నర్‌లని చెప్పుకొచ్చారు. ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనే భారతజట్టుకు వారి సేవలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు. వారు దూరమైతే జట్టుకు తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరించాడు. త్వరలోనే వారిద్దరు జట్టులోకి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. త్వరలోనే వారు క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

పాండ్యా, కేఎల్ రాహుల్ కంటే పెద్ద తప్పులు చేసిన వారు చాలా మంది భారత జట్టులో ఆడుతున్నారంటూ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక త్వరలోనే బీసీసీఐ తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తుందని, తన ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2013నాటి ఐపీఎల్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కామ్ ఆరోపణలతో బీసీసీఐ జీవిత కాల నిషేధంతో క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్‌.. బిగ్‌బాస్‌ 12 రియాల్టీ షోలో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

First published: January 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...