Cheteshwar Pujara : నయా వాల్ పుజారా ఎంతటి పోరాట యోధుడో మీకు తెలుసా..బర్త్ డే స్పెషల్ వీడియో

Pujara

Cheteshwar Pujara : నిన్న మొన్న వచ్చిన ఆటగాళ్లు కూడా ధనాధన్ క్రికెట్ లో దుమ్మురేపుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ అతడు మాత్రం సంప్రదాయ క్రికెట్ కే పరిమితమై తన ప్రత్యేకత చాటుకున్నాడు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కన్నా..టెక్నిక్ మెరుగుపర్చే ఫస్ట్ క్లాస్ క్రికెటకే ఓటు వేశాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన అతడు.. ఈ సారి తన సహనంతో కంగారూలకు పరీక్ష పెట్టాడు.

 • Share this:
  నిన్న మొన్న వచ్చిన ఆటగాళ్లు కూడా ధనాధన్ క్రికెట్ లో దుమ్మురేపుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ అతడు మాత్రం సంప్రదాయ క్రికెట్ కే పరిమితమై తన ప్రత్యేకత చాటుకున్నాడు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కన్నా..టెక్నిక్ మెరుగుపర్చే ఫస్ట్ క్లాస్ క్రికెటకే ఓటు వేశాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన అతడు.. ఈ సారి తన సహనంతో కంగారూలకు పరీక్ష పెట్టాడు.ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 928 బంతులు ఎదుర్కొన్న ఆ ఆటగాడు మరెవరో కాదు.. నయావాల్‌ చతేశ్వర్‌ పుజారా. ఇవాళ ది నయా వాల్ పుజారా 33 వ బర్త్ డే. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ డిపెండబుల్ ఆటగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయ్.  ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో చ‌తేశ్వ‌ర్ పుజారా.. కంగూరు బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్న తీరు హైలైట్‌. టీమిండియా ఆట‌గాళ్లు ప్ర‌ద‌ర్శించిన తెగువ‌కు పుజారా ఓ గ్రేట్ ఎగ్జాంపుల్‌. 140 కిలోమీట‌ర్ల వేగంతో ఆసీస్ బౌల‌ర్లు వేస్తున్న బంతుల్ని.. ఈ సిరీస్‌లో పుజారా ఎదుర్కొన్న తీరు అసాధార‌ణం. ఓ యోధుడి త‌ర‌హాలో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను చ‌తేశ్వ‌ర్ అడ్డుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులు వేస్తున్న ఆసీస్ బౌల‌ర్ల‌ను నిరాశ‌లోకి పంపించింది పుజారానే. అత‌న్ని ఔట్ చేసేందుకు ఆస్ట్రేలియ‌న్లు తెగ క‌ష్ట‌ప‌డ్డారు. స్పీడ్‌స్ట‌ర్స్‌ అయినా.. స్పిన్న‌ర్లు అయినా.. పుజారా డిఫెన్స్‌ను బ్రేక్ చేసేందుకు ఆస్ట్రేలియ‌న్లు ముప్పుతిప్ప‌లు ప‌డ్డారు. పుజారా వికెట్‌ను ప‌డ‌గొట్టేందుకు గ‌తంలో ఎన్న‌డు కూడా ఆసీస్ బౌల‌ర్లు ఇంత క‌ష్ట‌ప‌డ‌లేదు.

  ఇక ఈ సిరీస్‌లో ఆసీస్ బౌల‌ర్లు మ‌రీ అనైతికంగా వ్య‌వ‌హ‌రించారు. పుజారాను ఔట్ చేసేందుకు అత‌ని బాడీలైన్‌కు బౌలింగ్ చేశారు. షార్ట్ పిచ్ బౌన్స‌ర్ల‌తో అత‌న్ని అటాక్ చేశారు. కానీ పుజారాకు త‌న వికెట్ విలువ ఎంతో తెలుసు. ప‌ట్టుస‌డ‌ల‌ని ధైర్యంతో ఆసీస్ స్పీడ్‌గ‌న్స్‌ను ఎదుర్కొన్నాడు. వికెట్ కాపాడుకునేందుకు .. త‌న శ‌రీరానికి ఎన్ని దెబ్బ‌లు త‌గిలినా.. మ‌నోధైర్యాన్ని వీడ‌లేదు. ఆసీస్ బౌల‌ర్లు ఎంత క‌సితో వేసినా.. అంతే దీక్ష‌తో పుజారా ఆ బంతుల్ని ఆడాడు. కీల‌క‌మైన బ్రిస్బేన్ టెస్టులో పుజారా చేసిన పోరాటం మ‌రువ‌లేనిది. ఆసీస్ గెల‌వాలంటే.. పుజారా వికెట్ కీల‌కం. అత‌న్ని ఎంత త్వ‌ర‌గా ఔట్ చేస్తే.. మిగతా ఆట‌గాళ్ల‌ను అంతే త్వ‌ర‌గా ఇంటికి పంప‌వ‌చ్చు అన్న ధీమాలో ఆసీస్ ఉంది. కానీ పుజారా మాత్రం ఎక్క‌డా కంగారూల‌కు ఛాన్స్ ఇవ్వలేదు.


  గ‌బ్బా టెస్టులో పుజారా అనిత‌ర‌సాధ్య‌మైన బ్యాటింగ్ శైలిని ప్ర‌ద‌ర్శించాడు. త‌న ఆట‌తీరును ఓ కొత్త స్థాయికి తీసుకువెళ్లాడు. అత‌ని స‌హ‌నం ఎంత‌లా మారిదంటే.. అత‌న్ని ద న్యూ వాల్ అన్న ఆశ్చ‌ర్యం లేదు. ఒక‌ప్పుడు రాహుల్ ద్రావిడ్ పోషించిన పాత్ర‌ను ఇప్పుడు పుజారా నిర్వ‌ర్తించాడు. కానీ ఈ పాత్ర‌లో ప్ర‌త్యేకం అత‌ను ఎదుర్కొన్న దెబ్బ‌లు. బ్రిస్బేన్ టెస్టులో రెండ‌వ ఇన్నింగ్స్‌లో పుజారా శ‌రీరానికి క‌నీసం 12 సార్లు బంతులు త‌గిలాయి. అంటే ఆసీస్ బౌల‌ర్లు అత‌న్ని ఎంత‌లా టార్గెట్ చేశారో అర్థం అవుతుంది. మూడ‌వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పుజారాకు గాయం కాని ప్ర‌దేశం అంటూ లేకుండాపోయింది. త‌ల‌కు, ప‌క్క‌టెముక‌ల‌కు, చేతుల‌కు.. ప్ర‌తి చోట బ‌ల‌మైన వేగంతో వ‌చ్చే బంతులు త‌గిలాయి. ఆ నొప్పుల‌ను భ‌రిస్తేనే.. పుజారా త‌న ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఇలా ఎన్నో బంతులు తనకి తగులుతున్నా మొక్కవోని దీక్షతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. 81 టెస్ట్ లు ఆడిన పుజారా 6 వేల 111 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు ఉన్నాయ్. అతని కెరీర్ లో మొత్తం 13 వేల 572 బంతుల్ని ఎదుర్కొన్నాడు రాహుల్.
  Published by:Sridhar Reddy
  First published: