హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: అవి యాంటీ సెక్స్ బెడ్స్ అంటున్న నిర్వాహకులు.. కాదని నిరూపించిన అథ్లెట్..

Tokyo Olympics: అవి యాంటీ సెక్స్ బెడ్స్ అంటున్న నిర్వాహకులు.. కాదని నిరూపించిన అథ్లెట్..

అవి యాంటీ సెక్స్ బెడ్లు కావని నిరూపించిన ఐర్లాండ్ జిమ్నాస్ట్ (Olympics)

అవి యాంటీ సెక్స్ బెడ్లు కావని నిరూపించిన ఐర్లాండ్ జిమ్నాస్ట్ (Olympics)

అథ్లెట్లు ఒలింపిక్ విలేజ్‌లో శృంగారం చేయకూడదంటూ అక్కడ యాంటీ సెక్స్ బెడ్లను నిర్వాహక కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ఐర్లాండ్ జిమ్నాస్ట్ మెక్లీగన్ మాత్రం అవి ఏ మాత్రం యాంటీ సెక్స్ బెడ్లు కావని నిరూపించాడు.

టోక్యో ఒలింపిక్స్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాల నుంచి అథ్లెట్లు ఇప్పటికే టోక్యో చేరుకున్నారు. విమానాశ్రయంలోనే వారికి కోవిడ్ టెస్టులు చేసిన అనంతరం ఒలింపిక్ గ్రామంలోనికి అనుమతిస్తున్నారు. ప్రతీ అథ్లెట్‌కు ఒలింపిక్ విలేజ్‌లోని అపార్ట్‌మెంట్లలో గదులు కేటాయిస్తున్నారు. ప్రతీ గదిలో రెండు బెడ్లు ఉంటాయి. కాగా, ఒలింపిక్ నిర్వాహకులు కోవిడ్ కారణంగా ప్రతీ అథ్లెట్ భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. గతంలో ఒలింపిక్ గ్రామాల్లో అథ్లెట్లు శృంగారం జరిపేవాళ్లు. సిడ్నీ, రియో ఒలింపిక్స్ సందర్భంగా లక్షలాది కండోమ్స్‌ను నిర్వాహకులే అథ్లెట్లకు ఫ్రీగా ఇచ్చారు. అయితే ప్రస్తుతం అథ్లెట్లు తప్పనిసరిగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతున్నారు. అంతే కాకుండా ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన బెడ్లు కూడా 'యాంటీ-సెక్స్' అయి చెబుతున్నారు. కార్డు బోర్డుతో తయారైన ఈ బెడ్లు కేవలం 200 కేజీల బరువును మాత్రమే మోస్తాయంటా. అంతే కాకుండా దానిపై ఒకరి కంటే ఎక్కువ మంది పట్టను కూడా పట్టరు. ఎవరైనా ఆ కార్డ్‌బోర్డ్ బెడ్లపై ఎగిరినా విరిగిపోతాయని నిర్వాహకులు చెబుతున్నారు.

కార్డ్ బోర్డుతో తయారు చేసిన ఈ బెడ్లను ఒలింపిక్స్ అనంతరం పేపర్‌గా మార్చి అమ్మేస్తారంటా. అంతే కాకుండా గదుల్లో వాడే మ్యాట్రెస్‌లను రీసైకిల్ చేసి ప్లాస్టిక్ వస్తువులుగా మార్చనున్నారు. ఒలింపిక్ విలేజ్‌లో వాడే ప్రతీ వస్తువును తర్వాత రిసైకిల్ చేసే విధంగా రూపొందించారు. దాని వల్ల పర్యావరణానికి కూడా హాని కలగదని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ చెబుతున్నది.


అయితే ఒలింపిక్ విలేజ్‌లో అడుగుపెట్టిన ఐర్లాండ్ జిమ్నాస్ట్ రైస్ మెక్లీగన్ మాత్రం ఆ బెడ్లు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని చెబుతున్నాడు. నిర్వాహకులు చెబుతున్నట్లు అవి 'యాంటీ సెక్స్' బెడ్లు మాత్రం కావని అంటున్నాడు. ఆ బెడ్‌పై గంతులు వేస్తూ చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో అంటూ ఒక వీడియో కూడా పెట్టాడు. ఒలింపిక్ నిర్వాహకులు దానిపై ఎగిరితే విరిగిపోతాయని అంటున్నారు. కానీ ఇవి ఏ మాత్రం విరగడం లేదని వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే మెక్లీగన్ పెట్టిన వీడియోకు ఒలింపిక్ నిర్వాహక కమిటీ ట్విట్టర్‌లో స్పందించింది. 'ఒక నమ్మకాన్ని బ్రేక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఒలింపిక్స్ బెడ్స్ విషయంలో మేం పెట్టుకున్న నమ్మకం చాలా రాంగ్ అని ఐర్లాండ్ టీమ్ నిరూపించింది. జిమ్నాస్ట్ మెక్లీగన్ ఈ విషయం మాకు తెలియజేశాడు' అంటూ సరదాగా ట్వీట్ చేసింది. అందుకూ అనుకున్నట్లు ఆ బెట్లు విరగవు.. చాలా స్టర్డీగా ఉంటాయని చెప్పింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

First published:

Tags: Sex, Tokyo Olympics

ఉత్తమ కథలు