Hockey India : 1972 ఒలిపింక్ పతక విజేత.. భారత హాకీ జట్టు దిగ్గజ ప్లేయర్ వారిందర్ సింగ్ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన స్వస్థలం జలంధర్ లోని సొంత ఇంటిలో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని హాకీ ఇండియా (Hockey India) ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. వారిందర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసింది. వారీందర్ సింగ్ (Varinder Singh) లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్న హాకీ ఇండియా ఆయన మరణానికి నివాళులు అర్పించింది. 1947 మే 16న జలంధర్ లో వారిందర్ సింగ్ జన్మించారు. చిన్ననాటి నుంచే హాకీ మీద ఆసక్తి కలగడంతో ఆ దశగా అడుగులు వేశారు. తీవ్రంగా కష్టపడి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా ఒలింపిక్స్ (Olympics), ప్రపంచకప్ (World Cup), ఆసియా గేమ్స్ (Asia Games)వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
ఇది కూడా చదవండి : ఏందయ్యా అర్జున్ ఇదీ..? 31 ఏళ్ల ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ తో సచిన్ తనయుడి..
ఈ క్రమంలో 1975లో మలేసియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా జరిగిన పురుషుల హాకీ ప్రపంచకప్ లో పాల్గొన్న భారత జట్టులో వారిందర్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. అంతకుమందు మ్యూనిచ్ వేదికగా జరిగిన 1972 ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో వారిందర్ సభ్యుడిగా ఉన్నారు. వీటితో పాటు 1973 హాకీ ప్రపంచకప్ లో.. 1974, 1978లలో జరిగిన ఆసియా గేమ్స్ లో రజత పతకాలు సాధించిన భారత జట్టులో వారిందర్ సింగ్ భాగంగా ఉన్నారు. 2007లో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
In light of the tragic passing of the great Hockey player Shri Varinder Singh, we pray to the Almighty to grant the departed person's soul eternal rest and to provide the family members the fortitude to endure this irreparable loss. ???????? pic.twitter.com/s7Jb5xH0e3
— Hockey India (@TheHockeyIndia) June 28, 2022
వారిందర్ సింగ్ సాధించిన ఘనతలను భారత దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే ఉంటుందని హాకీ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వారిందర్ సింగ్ మైదానంల ో మెరుపు వేగంతో కదులుతూ గోల్స్ చేసే అవకాశాలను సృష్టించేవాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.