Home /News /sports /

పాత ట్వీట్లు మెడకు చుట్టుకున్నాయి.. క్షమాపణలతో ఆగేలా లేదు.. పాపం ఇంగ్లాండ్ బౌలర్ రాబిన్‌సన్

పాత ట్వీట్లు మెడకు చుట్టుకున్నాయి.. క్షమాపణలతో ఆగేలా లేదు.. పాపం ఇంగ్లాండ్ బౌలర్ రాబిన్‌సన్

చిక్కుల్లో అరంగేట్రం బౌలర్ ఓలీ రాబిన్‌సన్

చిక్కుల్లో అరంగేట్రం బౌలర్ ఓలీ రాబిన్‌సన్

టీనేజిలో చేసిన ట్వీట్లు ఆ యువ క్రికెటర్ జాతీయ జట్టులోకి వచ్చాక మెడకు చుట్టుకున్నాయి. అప్పుడు చేసిన తప్పులకు తనను క్షమించమని కోరినా.. విమర్శకులు మాత్రం వదిలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో రాబిన్ సన్ కెరీర్ డైలమాలో పడింది.

  న్యూజీలాండ్‌తో (New Zealand) జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోని (Test Series) తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ బౌలర్ రాబిన్‌సన్‌కు (Ollie Robinson) విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించిన ఓలీ రాబిన్‌సన్ తొమ్మిదేళ్ల క్రితం చేసిన ట్వీట్లు  (Tweets)మెడకు చుట్టుకున్నాయి. టీనేజ్ వయసులో ఉన్నప్పుడు తన ట్విట్టర్ ఖాతాలో స్త్రి వివక్ష, జాత్యాంహంకార పోస్టులు పెట్టాడు. 2012 నుంచి 2014 మధ్యలో ఈ ట్వీట్లు చేశాడు. ఆ సమయంలో తనకు ఒక రోజు ఈ ట్వీట్లు మెడకు చుట్టుకుంటాయని కూడా ఆలోచించలేదు. తొలి రోజు అతడు వికట్లు తీస్తున్న సమయంలోనే కొంత మంది అతడు గతంలో చేసిన ట్వీట్లను బయట పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో ఇవి విస్తృతంగా వ్యాప్తి చెందాయి. దీంతో ఓలీ రాబిన్‌సన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. స్త్రీలను, తోటి మనుషులను గౌరవించలేని వ్యక్తికి జాతీయ జట్టులో స్థానం ఎలా కల్పించారంటూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ని కూడా విమర్శిస్తున్నారు. అయితే తొలి రోజు మ్యాచ్ ముగిసిన వెంటనే తనపై వస్తున్న విమర్శలకు రాబిన్ సన్ సమాధానం చెప్పాడు.

  'తాను చిన్నతనంలో (అప్పుడు 18 ఏళ్లు) తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో ఆ ట్వీట్లు పెట్టాను. నేను ఆ తప్పు చేయకుండా వేయాల్సి ఉన్నది. తాను ఇప్పుడు పరిణితి చెందాను.. ఏది ఏమైనా తాను అలా లింగ వివక్షతో కూడిన జాత్యాంహంకార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. నన్ను క్షమించండి' అని అన్నాడు. గతంలో తాను చేసిన తప్పు వల్ల చాలా సిగ్గుపడుతున్నానని.. దయచేసి తనను క్షమించమని వేడుకున్నాడు. అప్పట్లో నా మానసిక స్థితి సరిగా లేదని.. ఇది క్షమించరాని నేరం అయినా.. ఒక్కసారి మన్నించాలని రాబిన్ సన్ కోరాడు. మ్యాచ్‌లో న్యూజీలాండ్ వికెట్లు తీసి రాణించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. కాని డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. అప్పట్లో నేను చేసిన తప్పు ఇలా వెంటాడుతుందని అనుకోలేదు. ఇది నిజంగా నా జీవితంలోనే పెద్ద కళంకంగా మారింది. అప్పట్లో నా ప్రవర్తన అలాగే ఉండేది. కానీ తర్వాత జీవితంలో నేను చాలా మారిపోయాను. ఒక మంచి క్రికెటర్‌గా నన్ను నేను మలుచుకోవడానికి తీవ్రంగా శ్రమించానని రాబిన్ సన్ చెప్పాడు. కాగా, తాను యార్క్‌షైర్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు ఒకసారి హఠాత్తుగా వేటు వేశారు. అప్పుడు నేను చాలా కుంగిపోయాను. అందుకే అలా ట్వీట్లు చేశాను అని రాబిన్ సన్ చెప్పుకొచ్చాడు.

  ఓలీ రాబిన్‌సన్ ట్వీట్లు


  కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓలీ రాబిన్‌సన్ చేసిన ట్వీట్లు


  కాగా, రాబిన్‌సన్ ఉదంతంతో ఈసీబీ మేల్కొన్నది. ఇకపై జాతీయ జట్టులోకి యువ క్రికెటర్లను తీసుకునే ముందు వారి సోషల్ మీడియా చరిత్రను పూర్తిగా పరిశీలించాలని భావిస్తున్నది. యువ క్రికెటర్ల ప్రవర్తన కారణంగా దేశానికి చెడ్డ పేరు రాకూడదని కోరుకుంటున్నది. కాగా, రాబిన్‌సన్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో అతడిని రెండవ టెస్టు నుంచి తప్పించే అవకాశం ఉన్నది.
  Published by:John Naveen Kora
  First published:

  Tags: Cricket, England, Racism, Tweets

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు