HOME » NEWS » sports » OLD LADY WHO FAILS TO RECOGNISE PAK STAR SHAHID AFRIDI VIDEO GOES VIRAL SRD

Shahid Afridi : తన దేశంలోనే షాహిద్ అఫ్రిదికి షాక్.. స్టార్ క్రికెటర్ ను గుర్తు పట్టని మహిళ..వీడియో వైరల్

Shahid Afridi : పాకిస్థాన్ మాజీ స్టార్ క్రికెటర్, లెజండరీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది అంటే క్రికెట్ ప్రపంచంలో తెలియని వారుండరు. చాలా మంది దేశాల్లో అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

news18-telugu
Updated: January 12, 2021, 10:58 PM IST
Shahid Afridi : తన దేశంలోనే షాహిద్ అఫ్రిదికి షాక్.. స్టార్ క్రికెటర్ ను గుర్తు పట్టని మహిళ..వీడియో వైరల్
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది(ఫైల్ ఫోటో)
  • Share this:
పాకిస్థాన్ మాజీ స్టార్ క్రికెటర్, లెజండరీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది అంటే క్రికెట్ ప్రపంచంలో తెలియని వారుండరు. చాలా మంది దేశాల్లో అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూఏఈ దేశాల్లో అయితే అతనికున్న క్రేజే వేరు. అంతేందుకు మన భారత్ లో కూడా ఈ పాక్ మాజీ ఆటగాడికి అభిమాన గణం ఉంది. ఇంక సొంత దేశం పాకిస్థాన్ లో అయితే.. షాహిద్ అఫ్రిదికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే క్రికెటర్ కు కూడా లేదు. పాక్ లో షాహిద్ అఫ్రిదిని బూమ్ బూమ్ అఫ్రిది అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. అలాంటి షాహిద్ అఫ్రిదికి తన దేశంలో షాక్ తగిలింది. ఓ మహిళ అతన్ని గుర్తు పట్టలేదు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళా.. షాహిద్ అఫ్రిదిని బాబు ఇటు రా.. నీ పేరు షాహిద్ అఫ్రిది అంటా.. ఈ అమ్మాయిలు చెబుతున్నారు. రా మాతో ఫోటో తీసుకో అంటూ పిలిచింది. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు.కానీ.. ఆమె పిలవగానే స్టార్ క్రికెటర్ హోదాను మరిచి వారితో ఫోటో తీసుకున్నాడు అఫ్రిది. దీంతో అతని మంచితనానికి కూడా లైక్స్ పడుతున్నాయ్.  ఈ వీడియో ఎయిర్ పోర్ట్ లో తీసినట్లు తెలుస్తోంది.






లిమిటెట్ క్రికెట్లో షాహిద్ అఫ్రిదికి అద్భుతమైన రికార్డులున్నాయ్. 2017 లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్రిది ఇప్పుడు వివిధ దేశాల టీ-20 లీగ్ లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లేటెస్ట్ గా శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో ఆడిన అఫ్రిది.. వ్యక్తిగత కారణాలతో ఆ టోర్నీకి దూరమయ్యాడు. వన్డేలో ఐదు వేలకు పైగా పరుగులు..350 వికెట్లు తీసిన అరుదైన రికార్డు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది.
Published by: Sridhar Reddy
First published: January 12, 2021, 10:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading