ఒడిస్సా హాకీ అమ్మాయిలకు ఒక్కొక్కరికీ రూ. కోటి నజరానా!

నలుగురు అమ్మాయిలకు చెరో రూ. కోటి నజరానా ప్రకటించిన ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్... ద్యుతి చంద్‌కు మూడు కోట్ల చెక్కు అందజేసిన సీఎం!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 2, 2018, 3:07 PM IST
ఒడిస్సా హాకీ అమ్మాయిలకు ఒక్కొక్కరికీ రూ. కోటి నజరానా!
భారత హాకీ అమ్మాయిలు
  • Share this:
ఏషియాడ్ 2018లో ఫైనల్ చేసి, రజత పతకం సాధించిన హాకీ ఉమెన్స్ టీంలోని ఒడిస్సా రాష్ట్ర అమ్మాయిలకు భారీ నజరానా ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. హాకీ ఇండియా టీంలో సభ్యులుగా ఉన్న ఒడిస్సా రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు సునీతా లక్రా, నమితా టొప్పో, లిలిమ మిన్జ్, డీప్ గ్రేస్ లకు ఒక్కొక్కటికి కోటి రూపాయల పారితోషికం ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు నవీన్ పట్నాయక్.

20 ఏళ్ల తర్వాత ఏషియాడ్ ఫైనల్ చేరిన హాకీ ఉమెన్స్ టీం... తుది పోరులో జపాన్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పురుషుల జట్టు కంటే మెరుగైన ప్రదర్శనే కనబర్చింది ఉమెన్స్ టీం. వారికి ప్రోత్సాహకంగా ఈ నగదు నజరానా ఇవ్వబోతున్నట్టు ఒడిస్సా ప్రభుత్వాధికారులు ప్రకటించారు. ఇంతకు ముందు ఏషియాడ్ 2018లో వంద మీటర్ల స్ప్రింట్‌‌లో రజత పతకం సాధించిన భారత యువ స్ప్రింటర్ ద్యుతి చంద్‌కు ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోటిన్నర రూపాయల పారితోషికం ప్రకటించారు. దాంతో తమ రాష్ట్రం నుంచి ఏషియాడ్‌కు వెళ్లి, దేశం గర్వించేలా చేసిన ద్యుతి చంద్‌కు బహుమానంగా ఒడిస్సా ముఖ్యమంత్రి కోటిన్నర రూపాయలు ప్రకటించారు. ఆ తర్వాత 200 మీటర్ల ఈవెంట్‌లో రజతం సాధించింది ద్యుతి చంద్‌. దాంతో మరో కోటిన్నర రూపాయల నజరానా ప్రకటించారు నవీన్ పట్నాయక్.

స్వదేశం చేరిన ద్యుతి చంద్‌కు మూడు కోట్ల రూపాయల నజరానా బహుకరించారు కూడా.

అదీగాక ప్రస్తుతం హాకీ ఇండియా మెన్స్, ఉమెన్స్ జట్లకు ఒడిస్సా రాష్ట్రం స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. నవంబర్ 28 నుంచి జరగబోయే మెన్స్ హాకీ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం కూడా ఇవ్వబోతోంది ఒడిస్సా. పతకాలు గెలిచిన ఆటగాళ్లకు మాత్రమే కాకుండా కోచ్‌లకు కూడా నగదు బహుమతి ప్రకటించింది ఒడిస్సా ప్రభుత్వం. కోచ్‌లకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల నజరానాగా చెల్లించనున్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా పతకాలు గెలిచిన వారికి భారీ నజరానా ఇస్తూ, ప్రోత్సాహకం కల్పిస్తున్న నవీన్ పట్నాయక్‌ను క్రీడాభిమానులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
Published by: Ramu Chinthakindhi
First published: September 2, 2018, 3:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading