వరల్డ్ కప్ 2019 భారత జట్టులో సచిన్ టెండూల్కర్ పేరు... అలా ఎలా సాధ్యం...

భారత జట్టులో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్... సచిన్ అభిమానుల సంతోషం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 16, 2019, 6:52 PM IST
వరల్డ్ కప్ 2019 భారత జట్టులో సచిన్ టెండూల్కర్ పేరు... అలా ఎలా సాధ్యం...
మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాంతాలలో పోషకాహార లోపం, నిరక్షరాస్యత తదితర సమస్యలను ఒక పత్రికలో చూసి సచిన్ గిరిజన గ్రామాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. పిల్లల కోసం టెండూల్కర్ చేస్తున్న కృషి ముఖ్యంగా అట్టడుగున ఉన్నవారు మరియు సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి బాగా ఉపయోగపడుతుంది.
  • Share this:
ప్రపంచకప్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే భారత్‌తో పాటు ఆస్ట్రేలయా, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్‌కు కూడా వరల్డ్‌కప్ ఆడబోయే జట్టును ప్రకటించాయి. భారత జట్టు కూర్పు కూడా కొన్ని ప్రశంసలు, కొన్ని విమర్శలు వినిపించాయి. అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కకపోవడంపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, గౌతమ్ గంభీర్ ప్రత్యేక్ష్యంగానే పెదవి విరిచారు. వీరి గురించి ఇష్యూ పెద్దది కాకముందే స్పందించిన సెలక్టర్లు... స్టాండ్ బై‌గా ఈ ఇద్దరికీ కూడా జట్టులో స్థానం కల్పించారు. తాజాగా సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా భారత జట్టులో ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు ఫ్యాన్స్. 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించి, ఆట నుంచి దూరమయ్యాడు సచిన్ రమేశ్ టెండూల్కర్. క్రికెట్ అనేది ఓ మతం అయితే దానికి దేవుడుగా కీర్తించబడిన ఏకైక లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సచిన్ సాధించిన రికార్డల గురించి చెప్పాలంటే ఓ పుస్తకం రాయాల్సిందే. అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగులు, వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు, హాఫ్ సెంచరీలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లెక్కలు... ఇలా ప్రతిదానిలో సచిన్ టాప్‌లో ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డుల గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదు, ఓ పుస్తకం సరిపోదు. అనితరసాధ్యమైన రికార్డులెన్నో తన పేరిట లిఖించుకున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా మారిన లెఫ్ట్ హ్యాండర్... క్రికెట్ చరిత్రలోనే అనితరసాధ్యమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సచిన్ క్రికెట్ ఆడడం మానేసిన తర్వాత చాలామంది క్రికెట్ చూడడం కూడా ఆపేశారు. నేచురల్ స్టార్ నాని కూడా ఇదే విషయాన్ని తన కొత్త సినిమా ‘జెర్సీ’ ప్రమోషన్‌లో కూడా చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Team India for World Cup 2019, Team India squad, team india, world cup squad team india, World Cup 2019, world cup indian team, virat kohli, rohit sharma, ms dhoni, Sachin tendulkar in Worldcup 2019 Indian team, వన్డే వరల్డ్‌కప్, ప్రపంచకప్ టీమిండియా, భారత జట్టు వన్డే వరల్డ్ కప్, ప్రపంచ కప్, వరల్డ్ కప్ 2019, విరాట్ కొహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, సచిన్ టెండుల్కర్
2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత త్రివర్ణ పతాకంతో సచిన్ టెండూల్కర్ ఆనందం...


క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్... మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం లేదు కానీ ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టు ఆటగాళ్ల పేర్లలో సచిన్ టెండూల్కర్ పేరు దాగి ఉండడమే మాస్టర్ ఫ్యాన్స్‌కు సంతోషాన్నిస్తున్న విషయం.
MS Dhoni
Rohit ShArma
Chahal
Virat KoHlihardIk Pandya
Vijay ShaNkar
Dinesh KarThik
kEdar Jadav
RaviNdra jadeja
MohammaD Shami
BUmrah
KuLdeep Yadav
Bhuvaneshwar Kumar
ShikhAr Dhawan
KL Rahul

వరల్డ్ కప్ ఆడే 15 మంది ఆటగాళ్ల పేర్లలో సచిన్ టెండూల్కర్ పేరు దాగి ఉండడాన్ని గమనించిన ఓ అభిమాని... ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యింది.  సచిన్ టెండూల్కర్ పేరుని దాచుకున్న భారత జట్టు, లెజెండరీ క్రికెటర్ స్పూర్తితోనే వరల్డ్ కప్ గెలుచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.  ఇంగ్లాండ్ వేదికగా మే 30న వన్డే ప్రపంచకప్ మొదలవుతుండగా...  జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడుతోంది భారత జట్టు.

Published by: Ramu Chinthakindhi
First published: April 24, 2019, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading