Home /News /sports /

NZ VS ENG 3RD TEST LIVE SCORES NEW ZEALAND BATTER HENRY NICHOLLS GETS OUT TO JACK LEACH IN MOST BIZARRE WAY POSSIBLE IN 3RD ENG VS NZ TEST SJN

NZ vs ENG : క్యాచ్ లందు.. ఈ క్యాచ్ వేరయా.! విచిత్రంగా అవుటైన కివీస్ బ్యాటర్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

PC : TWITTER

PC : TWITTER

NZ vs ENG : ఇంగ్లండ్ (England)తో ఆడిన తొలి రెండు టెస్టు మ్యాచ్ ల్లోనూ ఓడిన న్యూజిలాండ్ (New Zealand) జట్టు ఇప్పటికే సిరీస్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్టు మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని కివీస్ జట్టు చేస్తోంది. అయితే గురువారం నుంచి ఇంగ్లండ్ తో ఆరంభమైన మూడో టెస్టులోనే న్యూజిలాండ్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు.

ఇంకా చదవండి ...
NZ vs ENG : ఇంగ్లండ్ (England)తో ఆడిన తొలి రెండు టెస్టు మ్యాచ్ ల్లోనూ ఓడిన న్యూజిలాండ్ (New Zealand) జట్టు ఇప్పటికే సిరీస్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్టు మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని కివీస్ జట్టు చేస్తోంది. అయితే గురువారం నుంచి ఇంగ్లండ్ తో ఆరంభమైన మూడో టెస్టులోనే న్యూజిలాండ్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. మరోసారి టాపార్డర్ కుప్పకూలగా.. ఎప్పటిలానే డారిల్ మిచెల్ (78 బ్యాటింగ్), టామ్ బ్లండెల్ (45 బ్యాటింగ్) జట్టును ఆదుకున్నారు. వీరు అజేయమైన ఆరో వికెట్ కు 102 పరుగులు జోడించారు. దాంతో తొలి రోజు ఆటను కివీస్ జట్టు 90 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులతో ముగించింది.

ఇది కూడా చదవండి : ఇదేం కర్మరా బాబు.. ఈ ర్యాంకింగ్స్ లో టీమిండియాను దాటేసిన అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్..

అయితే ఈ మ్యాచ్ లో కివీస్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ (19) విచిత్రంగా అవుటయ్యాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. 56వ ఓవర్ వేయడానికి జాక్ లీచ్ వచ్చాడు. అతడు వేసిన రెండో బంతిని నికోల్స్.. చూడచక్కని రీతిలో స్ట్రయిట్ డ్రైవ్ ఆడాడు. అతడు ఆడిన తీరును చూస్తే బాల్ బౌండరీకి వెళ్లడం ఖాయంలా కనిపించింది. అయితే నికోల్స్.. పాలిట తెలియకుండానే నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న సహచరుడు డారిల్ మిచెల్ విలన్ అయ్యాడు. బంతి నేరుగా అతడి వైపు రావడంతో.. మిచెల్ పక్కకు తప్పుకునే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిచెల్ బ్యాట్ ను తాకి.. దిశను మార్చుకుని మిడాఫ్ లో ఉన్న లీస్ చేతిలోకి వెళ్లి పడింది. అంతే క్యాచ్ పట్టిన లీస్.. బౌలింగ్ వేసిన లీచ్ దగ్గరి నుంచి అందరూ ఆశ్చర్యపోయారు. నికోల్స్ అయితే తాను అవుటైన విషయాన్ని కాసేపు నమ్మలేకపోయాడు. అంపైర్లు, ఇంగ్లండ్ ప్లేయర్లు ఏదో వింత జరిగిన దానిలా ఆ క్యాచ్ గురించే పదే పదే మాట్లాడారు.



కరోనా నుంచి కోలుకున్న న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగాడు. తొలి టెస్టులో పూర్తిగా విఫలమైన అతడు ఈ మ్యాచ్ లో 31 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే బ్రాడ్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. టామ్ లాథమ్ (0) తన పూర్ ఫామ్ ను కొనసాగించాడు. విల్ యంగ్ (20), డెవోన్ కాన్వే (26)లకు ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోరుగా మలచడంలో విఫలం అయ్యారు. 150 పరుగులకే చాప చుట్టేయడం ఖాయం అనుకున్న తరుణంలో కివీస్ ను మిచెల్, బ్లండెల్ ఆదుకున్నారు. వీరు అబేధ్యమైన ఆరో వికెట్ల కు 102 పరుగులు జోడించి తొలి రోజును ముగించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్ చెరో రెండు వికెట్లు తీశారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: England, England vs newzealand, India vs england, Kane Williamson, New Zealand, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు