హోమ్ /వార్తలు /క్రీడలు /

ENG vs NZ : జో రూట్ సూపర్ సెంచరీ.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన లెస్బియన్ జంట

ENG vs NZ : జో రూట్ సూపర్ సెంచరీ.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన లెస్బియన్ జంట

కేథరిన్, జో రూట్ (PC : TWITTER)

కేథరిన్, జో రూట్ (PC : TWITTER)

ENG vs NZ : గతేడాది నుంచి టెస్టుల్లో జో రూట్ (Joe Root) సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డులను బద్దలు కొట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాడు.

ENG vs NZ : గతేడాది నుంచి టెస్టుల్లో జో రూట్ (Joe Root) సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డులను బద్దలు కొట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఇక ఇంగ్లండ్ (Engalnd) జట్టు ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్ (New Zealand)తో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడుతుంది. ఈ సిరీస్ లో జో రూట్ సూపర్ ఫామ్ తో చెలరేగుతున్నాడు. తొలి టెస్టులో సెంచరీతో ఇంగ్లండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రూట్.. నాటింగ్ హామ్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులోనూ భారీ శతకంతో అదరగొట్టాడు. 211 బంతుల్లో 26 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 176 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. దాంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 539 పరుగులకు ఆలౌటైంది.

ఇది కూడా చదవండి : 'పంత్ తీరే అంత.. సరైన సమయంలో హ్యాండ్ ఇస్తాడు'.. మాజీ బ్యాటర్ సంచలన కామెంట్స్

అయితే నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టులోని లెస్బియన్ జంట హల్చల్ చేసింది. ఇటీవలె పెళ్లి చేసుకున్న నాట్ స్కీవర్, కేథరిన్ బ్రంట్ లు మ్యాచ్ చూసేందుకు వచ్చారు. వీరితోపాటు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఇషా గుహ కూడా ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించింది. జో రూట్ సెంచరీ అభివాదానికి తన సీట్ నుంచి లేచిన కేథరిన్ బ్రంట్ హిప్ మూమెంట్స్ తో అదరగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో 553 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ 539 పరుగలకు ఆలౌట్ అయ్యింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ ప్రస్తుతం 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఫలితంగా ప్రస్తుతం కివీస్ జట్టు 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్ విల్ యంగ్ (56), డెవోన్ కాన్వే (52) అర్ధ సెంచరీలు చేశారు. డారిల్ మిచెల్ (41 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్టువర్ట్ బ్రాడ్, మ్యాథ్యూ పాట్స్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఆటకు నేడే చివరి రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కివీస్ బౌలర్లు వికెట్లు తీస్తే మాత్రం న్యూజిలాండ్ గెలిచే అవకాశం ఉంది.

First published:

Tags: England, England vs newzealand, India vs South Africa, New Zealand

ఉత్తమ కథలు