హోమ్ /వార్తలు /క్రీడలు /

NZ Vs BAN : బంగ్లా ఫీల్డర్లు అంతే.. బంగ్లా ఫీల్డర్లు అంతే.. ఒక బంతికి 7 పరుగులు సమర్పయామి..

NZ Vs BAN : బంగ్లా ఫీల్డర్లు అంతే.. బంగ్లా ఫీల్డర్లు అంతే.. ఒక బంతికి 7 పరుగులు సమర్పయామి..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

NZ Vs BAN : ఫీల్డింగ్ లో బంగ్లా దేశ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఆ టీమ్ ఎన్నో సార్లు తమ చెత్త ఫీల్డింగ్ తో గెలిచే మ్యాచులు కూడా చేజార్చుకుంది. తాజాగా.. కివీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో

క్రికెట్ (Cricket) అంటేనే ఓ అద్భుతం అంటారు. అప్పడప్పుడూ ఈ జెంటిల్ మేన్ గేమ్ లో వింత ఘటనలు చోటు చేసుకుంటాయ్. న్యూజిలాండ్‌- బంగ్లాదేశ్‌ (New Zealand Vs Bangladesh) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇలాంటి విచిత్రమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 26 ఓవర్‌లో కేవలం ఒక బంతికే 7పరుగులును బంగ్లాదేశ్‌ ఫీల్డర్లు సమర్పించుకున్నారు. ఇన్నింగ్స్‌ 26 ఓవర్‌ వేసిన ఎబాడోట్ హొస్సేన్ బౌలింగ్‌లో అఖరి బంతిను విల్‌ యంగ్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్‌ తీసుకుంది. అయితే, స్లిప్‌లో ఉన్న లిటన్ దాస్ క్యాచ్‌ను వదిలివేయడంతో బంతి థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. ఇంతలో న్యూజిలాండ్‌ బ్యాటర్లు మూడు పరుగులు రాబట్టారు.

అయితే ఫీల్డర్‌ బౌలర్ ఎండ్‌ వైపు త్రో చేయగా, బౌలర్ ఆ బంతిని ఆపలేకపోవడంతో ఫోర్‌ బౌండరీకు వెళ్లింది. దీంతో ఓవర్‌త్రో రూపంలో మరో 4 పరుగులు రావడంతో.. అంపైర్‌ మెత్తంగా ఏడు పరుగులు ఇచ్చాడు. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. బంగ్లా ఫీల్డర్లు అంతే.. బంగ్లా ఫీల్డర్లు అంతే.. అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఇక, క్రైస్ట్చర్చ్ వేదికగా జరుగుతున్న ఆఖరు టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 349 పరుగులు చేసింది. ఆ జట్టు తాత్కాలిక సారథి టామ్ లాథమ్ (186 నాటౌట్), విల్ యంగ్ (54) డెవాన్ కాన్వే (99 నాటౌట్) దుమ్మురేపే ప్రదర్శన చేశారు. తొలి వికెట్ కు 148 పరుగులు జోడించిన తర్వాత ఓపెనర్ యంగ్.. షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్ లో నిష్క్రమించగా.. అనంతరం వచ్చిన కాన్వేతో జతకలిసిన లాథమ్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.

ఇక, ఈ మ్యాచులో న్యూజిలాండ్ బ్యాటర్ డేవాన్ కాన్వే అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో అర్ధసెంచరీ చేశాడు డేవాన్ కాన్వే. దీంతో, ఈ ఫార్మాట్​లో తొలి ఐదు టెస్టుల్లోని మొదటి ఇన్నింగ్స్​ అన్నింటిలోనూ హాఫ్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్​గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఇది కూడా చదవండి : ఒడియమ్మ..బడవ ఇదేందయ్యా ఇది.. RCBకి ఇంత క్రేజ్ ఉందా..?

గతేడాది జూన్​లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్​లో అరంగేట్రం చేశాడు కాన్వే. ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో అద్భుత డబుల్ సెంచరీ (200)తో సత్తాచాటాడు. ఆ తర్వాత ఎడ్జ్​బాస్టన్​ టెస్టులోనూ 80 పరుగులతో రాణించాడు. అలాగే టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్​లో 84 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్​తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో అద్భుత సెంచరీ (122)తో మెరిశాడు. ఇక, ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో మొదటి రోజు ఆటముగిసే సమయానికి 99 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

First published:

Tags: Bangladesh, Cricket, New Zealand, Viral Video

ఉత్తమ కథలు