NZ VS BAN BANGLADESH CREATES CRICKET HISTORY WITH THEIR FIRST TEST WIN OVER THE NEW ZEALAND SRD
NZ vs BAN : కివీస్ గడ్డపై బంగ్లా పులుల గర్జన.. సరికొత్త చరిత్ర.. ఆ రికార్డులు బ్రేక్..
NZ vs BAN (PC : ICC)
NZ vs BAN : న్యూజిలాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం. 2001 నుంచి న్యూజిలాండ్‌లో 32 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ అన్నింట్లో ఓడిపోయింది.
కివీస్ గడ్డ (NZ vs BAN) పై బంగ్లాదేశ్ (Bangladesh) చరిత్ర సృష్టించింది. కొత్త ఏడాది నూతన అధ్యాయానికి నాంది పలికింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ న్యూజిలాండ్ (New Zealand)ను వారి సొంత గడ్డపైనే ఓడించి రికార్డులు క్రియేట్ చేసింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో సొంత గడ్డపై ఆతిథ్య కివీస్‌ను మట్టి కరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌ను ఓడించి కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.న్యూజిలాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి బంగ్లాదేశ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంఫియన్స్షిప్ 2022-2023 లో సైతం మొదటి విజయం నమోదు చేసి పాయింట్ల ఖాతా తెరచింది. అంతేకాకుండా 2022 సంవత్సరాన్ని బంగ్లాదేశ్ ఘన విజయంతో ప్రారంభించింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ పేసర్ ఎబాడోత్ హుస్సేన్ 6 వికెట్లతో చెలరేగాడు. 147-5తో ఐదో రోజు ఉదయం ఆట ప్రారంభించిన అతిథ్య న్యూజిలాండ్ ఆలౌట్ కావడానికి ఎంతో సేపు పట్టలేదు. బంగ్లా బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్ క్యూ కట్టారు. 154 పరుగుల వద్ద 40 పరుగులు చేసిన రాస్ టేలర్‌ను హుస్సేన్ ఔట్ చేశాడు. 160 పరుగులు వద్ద జేమ్సన్ను హుస్సేన్ డకౌట్ చేశాడు.
ఆ తర్వాత 16 పరుగులు చేసిన రచీన్ రవీంద్రను, సౌథీని డకౌట్‌గా టాస్కిన్ అహ్మద్ ఫెమిలియన్ పంపాడు. చివరగా 8 పరుగులు చేసిన బోల్ట్‌ను హుస్సేన్ ఔట్ చేయడంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 169 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో ఎబాడోత్ హుస్సేన్ 6 వికెట్లతో చెలరేగాడు. టాస్కిన్ 3, హాసన్ ఒక వికెట్ తీశారు.
Bangladesh have made cricket history with their first Test win over the @BLACKCAPS
40 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను సునాయసంగా అందుకుంది. దీంతో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హాసన్ మ్యాచ్‌లో లేకున్న విజయం సాధించారు బంగ్లా పులులు. మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు తీసిన ఎబాడోత్ హుస్సేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఈ విజయంతో బంగ్లాదేశ్ 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది.
🔹 First win v New Zealand in New Zealand (in all formats)
🔹 First Test win v New Zealand
🔹 First away Test win against a team in the top five of the ICC Rankings
🔹 12 crucial #WTC23 points!
న్యూజిలాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం. 2001 నుంచి న్యూజిలాండ్‌లో 32 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ అన్నింట్లో ఓడిపోయింది. అందులో 16 టెస్టు మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. టెస్టు ఫార్మాట్లో ఇంటా, బయాటా న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే గెలుపు. గతంలో తమ హోంగ్రౌండ్లో సైతం కివీస్ చేతిలో బంగ్లా ఓటమిపాలైంది. అలాగే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి 5 స్థానాల్లో ఉన్న జట్టును బంగ్లాదేశ్ ఓడించడం కూడా ఇదే తొలిసారి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.