హోమ్ /వార్తలు /క్రీడలు /

Cricket : 8 ఏళ్లలో 27 ఐసీసీ ఈవెంట్లు.. పెరగనున్న జట్లు, మ్యాచ్‌ల సంఖ్య.. ఫుల్ లిస్ట్ ఇదిగో

Cricket : 8 ఏళ్లలో 27 ఐసీసీ ఈవెంట్లు.. పెరగనున్న జట్లు, మ్యాచ్‌ల సంఖ్య.. ఫుల్ లిస్ట్ ఇదిగో

మళ్లీ తెరపైకి చాంపియన్స్ ట్రోఫీ.. 2025 నుంచి పునఃప్రారంభం

మళ్లీ తెరపైకి చాంపియన్స్ ట్రోఫీ.. 2025 నుంచి పునఃప్రారంభం

ఐసీసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ముఖ్యంగా 2024 నుంచి ఎనిమిదేళ్ల పాటు నిర్వహించనున్న ఐసీసీ ఈవెంట్లకు సంబంధించిన జాబితాను ఖరారు చేసింది.

అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) (ICC) ఎగ్జిక్యూటీవ్ కమిటీ మంగళవారం దుబాయ్ వేదికగా నిర్వహించారు. ఐసీసీ చైర్మన్, సీఈవో, ఇతర సభ్యులతో పాటు, ఆయా బోర్డుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీసీసీఐ (BCCI) నుంచి రాజీవ్ శుక్లా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 2024 నుంచి 2031 వరకు ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీపీ)(FTC)ని ఐసీసీ ఆమోదించింది. అంతే కాకుండా ఆ ఎనిమిదేళ్ల వ్యవధిలో 27 ఐసీసీ ఈవెంట్లకు ఆమోద ముద్ర వేసింది. పురుషుల, మహిళల, అండర్ 19కు సంబంధించి ఈ టోర్నీలు జరుగున్నాయి. అయితే వన్డే, టీ20 వరల్డ్ కప్‌లకు (World Cup) సంబంధించి జట్ల సంఖ్యతో పాటు మ్యాచ్‌ల సంఖ్యను కూడా పెంచడానికి కమిటీ సభ్యులు ఆమెదం తెలిపారు. పురుషుల వన్డే వరల్డ్ కప్‌లో జట్ల సంఖ్యను 2027 నుంచి 10 నుంచి 14కు పెంచనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 54 మ్యాచ్‌లు ఉంటాయి. ఇక 2024 పురుషుల టీ20 వరల్డ్ కప్ నుంచి జట్ల సంఖ్యను 16 నుంచి 20కి పెంచనున్నారు. దీంతో మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 55కి చేరుకోనున్నది. గతంలో రద్దు చేసిన పురుషుల చాంపియన్స్ ట్రోఫీని తిరిగి 2024 నుంచి నిర్వహించనున్నారు.

ఇక మహిళల వన్డే వరల్డ్ కప్‌లో 8 జట్లతో 31 మ్యాచ్‌లు, టీ20 వరల్డ్ కప్‌లో 10 జట్లతో 23 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక 2023 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత 2025, 2027, 2029, 2031లో కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరుగనున్నాయి. 2031లో వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఓకేసారి వచ్చాయి.  పురుషుల విభాగంలో 12 ఈవెంట్లు, మహిళల విభాగంలో 8 ఈవెంట్లు, అండర్ 19 మహిళలలకు 3, పరుషులకు 4 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఈ ప్రతిపాదనలన్నింటికీ ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. ఇక మహిళల, అండర్ 19 ఈవెంట్లకు సంబంధించిన ఆతిథ్య హక్కుల బిడ్డింగ్ ప్రక్రియ ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభిస్తామని ఐసీసీ చెప్పింది.

ICC : బీసీసీఐ మాటకు తలొగ్గిన ఐసీసీ.. ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో టీ20 వరల్డ్ కప్‌పై తీసుకున్న నిర్ణయం ఇదే



ఏడాదిపురుషుల క్రికెట్మహిళల క్రికెట్అండర్ 19 క్రికెట్
2024టీ20 వరల్డ్ కప్టీ20 వరల్డ్ కప్పురుషుల వన్డే వరల్డ్ కప్
2025చాంపియన్స్ ట్రోఫీ,వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్వన్డే వరల్డ్ కప్మహిళల టీ20 వరల్డ్ కప్
2026టీ20 వరల్డ్ కప్టీ20 వరల్డ్ కప్పురుషుల వన్డే వరల్డ్ కప్
2027వన్డే వరల్డ్ కప్,వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్టీ20 చాంపియన్స్ ట్రోఫీమహిళల టీ20 వరల్డ్ కప్
2028టీ20 వరల్డ్ కప్టీ20 వరల్డ్ కప్పురుషుల వన్డే వరల్డ్ కప్
2029చాంపియన్స్ ట్రోఫీ,వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్వన్డే వరల్డ్ కప్మహిళల టీ20 వరల్డ్ కప్
2030టీ20 వరల్డ్ కప్టీ20 వరల్డ్ కప్పురుషుల వన్డే వరల్డ్ కప్
2031వన్డే వరల్డ్ కప్,వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్టీ20 చాంపియన్స్ ట్రోఫీ

First published:

Tags: ICC, T20 World Cup 2021, World cup

ఉత్తమ కథలు