Home /News /sports /

Shreyas Iyer: గురుశిష్యులు ఇద్దరూ అరంగేట్రం టెస్టులోనే సెంచరీలు బాదారు.. గరువుకు అయ్యర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే..!

Shreyas Iyer: గురుశిష్యులు ఇద్దరూ అరంగేట్రం టెస్టులోనే సెంచరీలు బాదారు.. గరువుకు అయ్యర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే..!

గురువుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శ్రేయస్ అయ్యర్(PC: BCCI)

గురువుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శ్రేయస్ అయ్యర్(PC: BCCI)

Shreyas Iyer: కాన్పూర్‌లో న్యూజీలాండ్‌తో జరుగుతున్న టెస్టులో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్.. అదే మ్యాచ్‌లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. కాగా, శ్రేయస్ అయ్యర్ కోచ్ ప్రవీణ్ అమ్రే కూడా టీమ్ఇండియా తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదడం విశేషం.

ఇంకా చదవండి ...
  కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజీలాండ్‌తో (New Zealand) జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్ (KL Rahul) వంటి సీనియర్లు అందుబాటులో లేకపోవడంతో వచ్చిన అవకాశాన్ని అయ్యర్ చక్కగా ఉపయోగించుకున్నడు. భారత జట్టు  (Team India) కీలక వికెట్లు పోగొట్టు కొని కష్టాల్లో ఉన్న సమయంలో బరిలోకి దిగి అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. 171 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సుల సాయంతో 105 పరుగులు చేశాడు. అంతే కాకుండా రవీంద్ర జడేజాతో కలసి సెంచరీ భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు. టీమ్ ఇండియా తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ కొట్టిన బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. అయ్యర్ కంటే ముందు 15 మంది భారత బ్యాటర్లు ఈ ఫీట్ సాధించాడు. ఇక సొంత గడ్డపై ఈ ఫీట్ సాధించిన 10వ క్రికెటర్‌గా కూడా అయ్యర్ నిలిచాడు.

  కాగా, శ్రేయస్ అయ్యర్‌ ముంబై రంజీ జట్టు క్రికెటర్‌గా ఉన్న సమయంలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ అమ్రే కోచ్‌గా ఉన్నాడు. అంతకు ముందు కూడా శ్రేయస్ అయ్యర్ కోచింగ్ ప్రవీణ్ దగ్గరే తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌లో మెలకువల నేర్చుకున్నది ప్రవీణ్ దగ్గరే. అయితే ఈ టీమ్ఇండియా మాజీ క్రికెటర్ 1992-93 సీజన్‌లో సౌతాఫ్రికా మీద అరంగేట్రం చేశాడు. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. దిగ్గజ బౌలర్లు అలన్ డొనాల్డ్, బ్రయన్ మెక్‌మిలన్ వంటి బౌలర్లను ఎదుర్కొని ఈ సెంచరీ చేశాడు. అజారుద్దీన్ తర్వాత ఈ ఫీట్ అందుకున్నాడు. ఆ ప్రవీణ్ అమ్రే కోచింగ్‌లో క్రికెటర్‌గా ఎదిగిన శ్రేయస్ అయ్యర్ కూడా అరంగేట్రం టెస్టులో సెంచరీ సాధించడం గమనార్హం. ప్రపంచంలో మరే గురు శిష్యులు అరంగేట్రం టెస్టుల్లో సెంచరీలు బాదలేదు.

  IND vs NZ: సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.. ఇండియాకు వికెట్ అందించాడు.. లంచ్‌ సమయానికి కివీస్ 197/2   మరోవైపు రెండో రోజు ఆట ముగిసిన అనంతరం అయ్యర్ పలు విషయాలు చెప్పాడు. 'ప్రవీణ్ సార్ దగ్గర శిష్యుడిగా చేరిన దగ్గర నుంచే నేను ఆటలో మెరుగయ్యాను. ఆయన నన్నెంతో ప్రోత్సహించాడు. వన్డే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి విజయం సాధించావు. ఐపీఎల్ కెప్టెన్‌గా కూడా విజయవంతం అయ్యావు. కానీ టెస్టు క్రికెట్ ఆడినప్పుడే నీ కెరీర్‌కు ఒక సార్థకత వస్తంది. నువ్వు టీమ్ ఇండియా తరపున టెస్ట్ క్యాప్ అందుకోవాలి. ఆ రోజు నాకు సంతోషం. అంతే కాదు నువ్వు టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేసిన రోజు నీ ఇంటికి డిన్నర్‌కు వస్తానని ప్రవీణ్ సార్ చెప్పారు' అని అయ్యర్ వెల్లడించాడు.


  అయ్యర్.. కోచ్ ప్రవీణ్ అమ్రే కోరిన రెండు కోరికలను ఒకే టెస్టులో నెరవేచ్చాడు. దీంతో రెండో మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రవీణ్ అమ్రేకు మెసేజ్ చేసి డిన్నర్‌కు ఆహ్వానించాడు. ప్రవీణ్ అమ్రేకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని అయ్యర్ అన్నాడు. ఇదే సార్‌కు ఇస్తున్న సర్‌ప్రైజ్ గిఫ్టని అన్నాడు. ఇక తాను కొట్టిన శతకాన్ని నాన్నకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. తన కెరీర్‌లో తల్లిదండ్రుల పాత్ర మరువలేనిదని.. నాన్నకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని అందుకే ఈ శతకాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నట్లు శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:John Kora
  First published:

  Tags: India vs newzealand, Shreyas Iyer, Team india, Test Cricket

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు