Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రీడలు /

యూఎస్ ఓపెన్: జొకోవిచ్ ఖాతాలో 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌

యూఎస్ ఓపెన్: జొకోవిచ్ ఖాతాలో 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌

యూఎస్ ఓపెన్ ట్రోపీని ముద్దాడుతున్న నోవాక్ జోకోవిచ్

యూఎస్ ఓపెన్ ట్రోపీని ముద్దాడుతున్న నోవాక్ జోకోవిచ్

హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరు... అర్జెంటీనా స్టార్ డెల్ ప్రోతోను 6-3, 7-6 (7/4), 6-3 తేడాతో ఓడించి, మూడోసారి యూఎస్ ఓపెన్ నెగ్గిన సెర్బియన్ సంచలనం!

2018 యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఫైట్‌ ఎటువంటి సంచలనాలు లేకుండానే ముగిసింది. అందరూ అనుకున్నట్టుగానే, ముందుగా ఊహించినట్టుగానే సెర్బియన్ సెన్సేషన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్... కెరీర్‌లో 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడాడు. నువ్వా- నేనా అన్నట్టుగా సాగిన ఫైనల్ పోరు టెన్నిస్ క్రీడాభిమానులను ఎంతగానో అలరించింది. యూఎస్ ఓపెన్ టోర్నీలో 6వ సీడ్ హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన నోవాక్ జొకోవిచ్, అర్జెంటీనీ స్టార్ డెల్ ప్రోతోపై వరుసగా మూడు వరుస సెట్లలో 6-3, 7-6 (7/4), 6-3 తేడాతో నెగ్గి, ముచ్ఛటగా మూడో సారి యూఎస్ ఓపెన్ నెగ్గాడు. ఈ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో అమెరికన్ టెన్నిస్ స్టార్ సంప్రాస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డుని సమం చేశాడు. రఫెల్ నాదల్ (17) కంటే మూడు, రోజర్ ఫెదరర్ (20) కంటే ఆరు గ్రాండ్‌స్లామ్స్ దూరంలో నిలిచాడు నోవాక్.

ఫ్రెంచ్ స్టార్ రఫెల్ నాదెల్ మోచేతి గాయంతో వెనుదిరడంతో లక్కీగా ఫైనల్ చేరిన అర్జెంటీనీ స్టార్ డెల్ ప్రోతో, జొకోవిచ్‌కి మధ్య మంచి రసవత్తర పోరు జరిగింది. జొకోవిచ్ వరుసగా మూడు సెట్లలో గెలిచినప్పటికీ, ప్రతీ గేమ్ పాయింట్ సాధించేందుకు చెమటోర్చాల్సి వచ్చింది. డెల్ ప్రోతో మొదటి మూడు సర్వీస్ గేమ్స్ నుంచి రెండు పాయింట్లు రాబట్టిన జోకో... 6-3 తేడాతో మొదటి సెట్ గెలిచాడు. రెండో సెట్‌లో ఇద్దరి మధ్య భీకర పోరు జరిగింది. ఒక్క పాయింట్ కోసం ఇరు ప్లేయర్స్ మధ్య 22 షాట్స్ పోరు జరిగింది. చివరికి ఆ పాయింట్ జోకోవిచ్‌కే సొంతమైంది. రెండో సెట్ ప్రారంభంలోనే జొకోవిచ్ 3-1 ఆధిపత్యం కనబర్చినప్పటికీ, వరుసగా రెండు పాయింట్లు సాధించిన డెల్ ప్రోతో 3-3తో స్కోర్ సమం చేశాడు. ఆ తర్వాత గేమ్ ఏకంగా 20 నిమిషాల పాటు సాగింది. మొత్తానికి 95 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘంగా సాగిన రెండో సెట్ ట్రై బ్రేక్‌తో నోవాక్ సొంతమైంది.

మూడో సెట్‌లోనూ డెల్ ప్రోతో మంచి పోరాటం కనబరిచాడు. 3-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న జొకోవిచ్ ఆధిపత్యాన్ని తగ్గిస్తూ... 3-3 స్కోర్ సమం చేశాడు. ఆ తర్వాత కూడా 24 షాట్స్ భారీ ర్యాలీ సాగింది. అయితే ఆ పాయింట్‌ సాధించి ఆధిక్యంలోకి వెళ్లిన జొకోవిచ్... వరుసగా రెండు పాయింట్లు సాధించి మూడో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు. మోచేతి గాయం కారణంగా గత టోర్నీకి దూరమైన 31 ఏళ్ల జొకో... 9 ఏళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ గెలవాలనుకున్న డెల్‌ప్రోతో ఆశలపై నీళ్లు చల్లాడు.

నొవాక్ జొకోవిచ్ అమెరికన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్‌ చేరడం ఇది 8వ సారి కాగా, మూడు సార్లు మాత్రమే సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచాడు. 2011, 2015లో యూఎస్ ఓపెన్ నెగ్గిన జొకో... మూడేళ్ల తర్వాత మూడోసారి టైటిల్ కైవసం చేసుకున్నాడు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకూ నొవాక్ జొకోవిచ్ 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 6 ఆస్ట్రేలియన్ ఓపెన్, 4 వింబుల్డన్ టైటిల్స్, 3 అమెరికన్ ఓపెన్ టైటిల్స్‌తో పాటు ఒక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఉన్నాయి.

First published:

Tags: US Open 2018

ఉత్తమ కథలు