మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఫైట్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జొకోవిచ్‌కు అర్జెంటీనా జెయింట్ జువాన్ మార్టిన్ డెల్ పోత్రో సవాల్ విసురుతున్నాడు. సెమీఫైనల్లో జపనీస్ సెన్సేషన్ కై నిషికోరీని చిత్తు చేయగా ...స్పానిష్ బుల్ రఫాల్ నడాల్ రిటైరవ్వడంతో డెల్ పోత్రో సులువుగా ఫైనల్ చేరాడు.తొలి సెమీఫైనల్లో నొవాక్ జొకోవిచ్..నిషికోరీపై బ్యాక్ టు బ్యాక్ సెట్లలో నెగ్గాడు.2014 అమెరికన్ ఓపెన్ సెమీస్‌లో నొవాక్‌ను చిత్తు చేసి పెను సంచలనం సృష్టించిన నిషికోరీ...ఈ సారి మాత్రం తేలిపోయాడు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఖాయమనుకున్న వారికి నిరాశే ఎదురైంది. మూడు వరుస సెట్లలో నెగ్గి నొవాక్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
మరో సెమీఫైనల్లో అర్జెంటీనా జెయింట్ డెల్పోత్రోకు అదృష్టం కలిసొచ్చింది.3వ సీడ్‌గా బరిలోకి దిగిన డెల్ పోత్రోతో జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్ రఫాల్ నడాల్ మధ్యలోనే రిటైరయ్యాడు.తొలి సెట్‌ను టై బ్రేక్‌లో నెగ్గి రెండో సెట్‌ను సైతం దక్కించుకుని ఊపు మీదున్న డెల్ పోత్రో విజయం దాదాపు ఖాయమైంది.మోకాలి నొప్పితో ఇబ్బందిపడిన నడాల్...పోటీ నుంచి తప్పుకున్నాడు. అప్పటికే 7-6, 6-2తో రెండు సెట్లు నెగ్గిన డెల్ పోత్రో సునాయాసంగా ఫైనల్‌కు అర్హత సాధించాడు.
నొవాక్ జొకోవిచ్ అమెరికన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ చేరడం ఇది 8వ సారి.డెల్ పోత్రో రెండో సారి ఫైనల్ చేరాడు.ఇప్పటివరకూ 7 సార్లు ఫైనల్ చేరినా రెండు సార్లు మాత్రమే నొవాక్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు.2009లో డెల్ పోత్రో యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు.13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో డెల్పోత్రో సాధించిన ఏకైక గ్రాండ్‌స్లామ్ టైటిల్ అమెరికన్ ఓపెన్ ట్రోఫీనే కావడం విశేషం.
మాజీ చాంపియన్ల మధ్య జరుగనున్న 2018 అమెరికన్ ఓపెన్ ఫైనల్ ఫైట్‌లో హోరాహోరీ పోరు ఖాయమంటున్నారు విశ్లేషకులు.యూఎస్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్ నెగ్గి మరో సారి ట్రోఫీ సొంతం చేసుకునే ప్లేయర్ ఎవరో తెలుసుకోవాలని టెన్నిస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Novak Djokovic, Rafael Nadal, Tennis, US Open 2018