నా కొడుకునే నిందిస్తారెందుకు? వైరస్‌ వ్యాప్తికి అతనే కారణం

Rekulapally Saichand
Updated: June 25, 2020, 2:22 PM IST
నా కొడుకునే నిందిస్తారెందుకు? వైరస్‌ వ్యాప్తికి  అతనే కారణం
  • Share this:
కరోనా మహామ్మారి క్రీడాకారులను వదలడం లేదు... చివరికి వారి వ్యక్తిగత జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా కరోనా వైరస్ బారిన పడిన సెర్బియా టెన్నిస్ స్టార్, టోర్నీ నిర్వహకుడైన నొవాక్ జకోవిచ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీలో పాల్గొన్న దిమిత్రోవ్‌,బోర్నా కోరిచ్‌లకు కరోనా సోకడంతో జొకోవిచ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నింబంధనలకు విరుద్దుంగా టోర్నీ నిర్వహించారంటూ పలువురు జొకోపై దుమ్మెత్తిపోస్తున్నారు.

వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో టోర్నీ నిర్వహించడం తెలివి తక్కువ పనంటూ నెటిజన్లు జకోవిచ్‌ను విమర్శిస్తున్నారు. అందరి విమర్శలతో అసహనంతో ఉన్న జకోవిచ్‌కు అతని తల్లిదండ్రులు మద్దుతుగా నిలిచారు. వైరస్‌ వ్యాప్తికి జకో కారణం కాదని దిమిత్రోవ్‌ కారణమంటూ పరోక్షంగా వ్యాఖ్యనించారు. దిమిత్రోవ్‌ అనారోగ్యంతోనే టోర్నీకి వచ్చాడేమో? అంటూ జకోవిచ్‌ తండ్రి సర్జాన్‌ అన్నారు.
First published: June 25, 2020, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading