హోమ్ /వార్తలు /క్రీడలు /

యూఎస్ ఓపెన్: 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్

యూఎస్ ఓపెన్: 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్

నొవాక్ జొకోవిచ్ ( Twitter)

నొవాక్ జొకోవిచ్ ( Twitter)

సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జొకోవిచ్...2018 అమెరికన్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. అర్జెంటీనా జెయింట్ జువాన్ మార్టిన్ డెల్ పోత్రో మధ్య పురుషుల సింగిల్స్ తుది సమరంలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాడు.

2018 యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఫైట్‌కు సమయం ఆసన్నమైంది. సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జొకోవిచ్‌ ...  అర్జెంటీనా జెయింట్ జువాన్ మార్టిన్ డెల్ పోత్రో మధ్య పురుషుల సింగిల్స్ తుది సమరానికి ఆర్దర్ యాషే స్టేడియంలో రంగం సిద్ధమైంది. 13 సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్‌ జొకోవిచ్ అమెరికన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ సాధించాలని తహతహలాడుతున్నాడు. ప్రస్తుత టోర్నీలో 6వ సీడ్‌గా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నొవాక్  టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు.

తొలి రౌండ్‌ నుంచే తిరుగులేని విజయాలతో టైటిల్ వేటలో నిలిచాడు. సెమీఫైనల్‌లో జపనీస్ సెన్సేషన్ కై నిషికోరీని చిత్తు చేసి సులువుగా ఫైనల్‌లో ఎంటరయ్యాడు.  తొలి సెమీఫైనల్‌లో నొవాక్ జొకోవిచ్...నిషికోరీపై బ్యాక్ టు బ్యాక్ సెట్లలో నెగ్గాడు. 2014 అమెరికన్ ఓపెన్ సెమీస్‌లో నొవాక్‌ను చిత్తు చేసి పెను సంచలనం సృష్టించిన నిషికోరీ...ఈ సారి మాత్రం తేలిపోయాడు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఖాయమనుకున్న వారికి నిరాశే ఎదురైంది. జొకోవిచ్ జోరు ముందు నిషికోరి తేలిపోవడంతో సెమీస్ పోరు ఏకపక్షంగా ముగిసింది. మూడు వరుస సెట్లలో నెగ్గి నొవాక్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆట ఆరంభం నుంచే తనదైన శైలిలోనే ఆధిపత్యం ప్రదర్శించాడు.6-3తో తొలి సెట్ సొంతం చేసుకుని శుభారంభం చేశాడు. 6-4తో రెండో సెట్ సైతం దక్కించుకుని మ్యాచ్‌పై పట్టుబిగించాడు. 6-2తో సులువుగా మూడో సెట్ నెగ్గి నిషికోరీని ఇంటిదారి పట్టించాడు.

31 ఏళ్ల నొవాక్ జొకోవిచ్ అమెరికన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్‌ చేరడం ఇది 8వ సారి. ఈ టోర్నీ ముందు వరకూ 7 సార్లు ఫైనల్ చేరినా రెండు సార్లు మాత్రమే సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. 2011, 2015లో యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. మూడేళ్ల తర్వాత మరోసారి టైటిల్ నెగ్గాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 2011 ఫైనల్‌లో స్పానిష్ బుల్ రఫాల్ నడాల్‌పై నాలుగు సెట్లలో నెగ్గి తొలిసారిగా అమెరికన్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడాడు. 2015 ఫైనల్‌లో గ్రాండ్‌స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్‌‌ను ఓడించి రెండో సారి యూఎస్ ఓపెన్ కింగ్ అనిపించుకున్నాడు.

15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకూ నొవాక్ జొకోవిచ్ 13 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 6 ఆస్ట్రేలియన్ ఓపెన్..4 వింబుల్డన్..2 అమెరికన్ ఓపెన్ టైటిల్స్‌తో పాటు ఒక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఉన్నాయి.  ప్రస్తుత యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ట్రోఫీ నెగ్గి తన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య పెంచుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.

ఇవీ చదవండి:

విరాట్ స్థానంలో రాయల్ చాలెంజర్స్ కెప్టెన్‌గా డివిలియర్స్!!


VIDEO: అలెస్టర్‌ కుక్‌‌కు విరాట్ సేన గార్డ్ ఆఫ్ ఆనర్

First published:

Tags: Novak Djokovic, Tennis, US Open 2018

ఉత్తమ కథలు