Home /News /sports /

NOVAK DJOKOVIC DEFEAT IN LEGAL BATTLE FAR AWAY FROM AUSTRALIAN OPEN FOR NOT GETTING VACCINATED EVK

Novak Djokovic: చెదిరిన జ‌కోవిచ్‌ క‌ల‌.. న్యాయ‌పోరాటంలో ఓట‌మి.. టీకా తీసుకోనందుకు ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరం!

Novak Djokovic

Novak Djokovic

Novak Djokovic | టెన్నిస్ వరల్డ్ నం. 1 నొవాక్ జొకోవిచ్ తన ఆస్ట్రేలియన్ వీసాను పునరుద్ధరించే బిడ్‌ను ఆదివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభానికి ఒక రోజు ముందు కోల్పోయాడు. పూర్తి ఫెడరల్ కోర్టు అతని బిడ్‌ను తిరస్కరించడంతో, అతను ఆస్ట్రేలియాలో ప్ర‌వేశాన్ని కోల్పోయాడు.

ఇంకా చదవండి ...
    టెన్నిస్ వరల్డ్ నం. 1 నొవాక్ జొకోవిచ్ తన ఆస్ట్రేలియన్ వీసాను పునరుద్ధరించే బిడ్‌ను ఆదివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభానికి ఒక రోజు ముందు కోల్పోయాడు. పూర్తి ఫెడరల్ కోర్టు అతని బిడ్‌ను తిరస్కరించడంతో, అతను ఆస్ట్రేలియాలో ప్ర‌వేశాన్ని కోల్పోయాడు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయం సాధించి, రికార్డు స్థాయిలో 21 పురుషుల గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకోవాలనే టెన్నిస్ సూపర్‌స్టార్ ఆశలకు తెరపడింది.  ప్ర‌పంచ నంబ‌ర్.1గా ఎదిగినా.. టీకా తీసుకోనందుకు అత‌న్ని ఈవెంట్‌లో ఆడ‌నివ్వ‌కుండా వీసా రద్దు చేసింది ప్ర‌భుత్వం. ఆ క్రీడాకారుడు ఎవ‌రో కాదు నొవాక్‌ జకోవిచ్‌. ప్రపంచ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్ (Novak Djokovic) ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు సిద్ధం అయిన వేళ పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ (Australian Open) గెల‌వాల‌ని ఎంతో ప‌ట్టుద‌లగా ఉన్న జ‌కోవిచ్‌కు క‌రోనా టీకా తీసుకోక‌పోవ‌డం పెద్ద దెబ్బ‌గా మారింది. అత‌ని వీసాను ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది.

    ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ జ‌కోవిజ్ కోర్టును ఆశ్ర‌యించారు. ఆస్ట్రేలియన్ ఇమ్మిగ్రేషన్ మంత్రి అలెక్స్ హాక్ వీసా ర‌ద్దును స‌వాలు చేస్తూ జ‌కోవిచ్ బిడ్‌ను ఫెడరల్ కోర్ట్ యొక్క ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ తిరస్కరించింది.

    Assembly Election : బీజేపీ ల‌క్ష్యం నెర‌వేరుతుందా.. ఐదు రాష్ట్రాల్లో మోదీ చ‌రిష్మా.. గెలుపు అవ‌కాశాలు!

    ప్రత్యేక చ‌ట్టం ఆధారంగా ర‌ద్దు..
    ఆస్ట్రేలియా వలస చట్టంలోని 133C(3) సెక్షన్‌ ప్రకారం నేనీ రోజు ప్రత్యేక అధికారాలను జ‌కోవిచ్‌పై ఉప‌యోగించారు. దేశంలో ప్ర‌జ‌ల ప్రయోజనార్థం నొవాక్‌ జకోవిచ్‌ వీసాను రద్దు చేశామ‌ని ఆస్ట్రేలియా (Australia)  విదేశాంగ మంత్రి అలెక్స్‌ హాక్ స్ప‌ష్టం చేశారు. అయితే జ‌కోవిచ్‌కు సంబంధించి మొద‌టి సారి వీసాను ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. దీనిపై అత‌ను కోర్టుకు వెళ్లాడు. అక్క‌డి ఫెడ‌రల్ కోర్టు వీసా ర‌ద్దును కొట్టివేసింది. దీంతో ప్ర‌భుత్వం ఆస్ట్రేలియా సరిహద్దు దళం, హోం మంత్రిత్వ శాఖ సమాచారం పరిగణనలోకి తీసుకొని.. ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి అలెక్స్‌ హాక్ వెల్ల‌డించారు.

    Assembly Elections : అప్పుడు లెక్క‌లేని పార్టీ.. ఇప్పుడు లెక్క‌లు మారుస్తోంది.. ర‌స‌వ‌త్త‌రంగా పంజాబ్ రాజ‌కీయం!

    తిరుగులేని రికార్డు..
    ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఓపెన్‌ను జకోవిచ్‌ తొమ్మిదిసార్లు గెలిచాడు. మరోసారి గ్రాండ్‌స్లామ్‌ గెలిచి అత్యధిక సార్లు గెలిచిన అరుదైన రికార్డును సాధిద్దాం అనుకొన్నాడు. అంతేకాకుండా చాలా కాలంగా ఊరిస్తున్న 21వ గ్రాండ్‌స్లామ్‌ సాధించాలని కలలు కన్నాడు. కానీ టీకా తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే జకోవిచ్ క‌ల చెదిరిపోయింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Australia, Novak Djokovic, Sports, Tennis, Vaccinated for Covid 19

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు