IND V NZ : నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్... వర్షం మ్యాచ్‌ని ముంచుతుందా...

India vs New Zealand World Cup 2019 : నటింగ్‌హామ్‌లో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. వాతావరణ వార్నింగ్స్‌లో ఇది మొదటిది. దీనర్థం వాతావరణం మారిపోతోందని. నేడు న్యూజిలాండ్‌తో జరిగే టీంఇండియా మూడో మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారేలా ఉంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 1:19 PM IST
IND V NZ : నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్... వర్షం మ్యాచ్‌ని ముంచుతుందా...
వర్షం పడితే ఎలా (Image : Twitter / ICC)
Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 1:19 PM IST
ICC World Cup 2019 : ఆస్ట్రేలియాను అలవోకగా ఓడించి... న్యూజిలాండ్‌ను చిత్తు చెయ్యాలని చూస్తున్న టీంఇండియా జోరుకు వర్షం బ్రేక్ వేసేలా కనిపిస్తో్ంది. మ్యాచ్ జరిగే నటింగ్‌‍హామ్‌లో సోమవారం నుంచీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా మొదటి హెచ్చరికగా ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. ఇవాళ ట్రెంట్ బ్రిడ్జిలో ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉన్నా... వర్షం వల్ల మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచీ అక్కడ కంటిన్యూగా వర్షం పడుతోంది. ఫలితంగా నటింగ్‌హామ్ నగరంలో జరగాల్సిన చాలా ఈవెంట్స్‌ రద్దయ్యాయి. టీంఇండియా ప్రాక్టీస్ కూడా సరిగా సాగలేదు. వాతావరణం చీకటిగా మారిపోయింది. మైదానంలో తడి ఆరలేదు.

గురువారం కూడా వాన పడే అవకాశం 50 శాతం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. అందువల్ల మ్యాచ్ జరిగే అవకాశం కూడా 50 శాతమే కనిపిస్తోంది. నటింగ్‌హామ్ టైమ్ ప్రకారం ఉదయం 10 గంటల సమయానికి వాతావరణం సెట్టయ్యే అవకాశాలున్నాయి. ఐతే... టాస్ వేసేది ఉదయం 9 గంటలకు. (ఇండియా టైమ్ ప్రకారం మధ్యాహ్నం 2.30కి) కానీ మధ్యాహ్నం తర్వాత వర్షం పడేలా ఉంది. ప్రస్తుతం అక్కడి ఉష్ణోగ్రత 10 నుంచీ 14 డిగ్రీలు మాత్రమే ఉంది.





మ్యాచ్ రద్దైతే ఏంటి పరిస్థితి : ఒక వేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే... ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడి, మూడింటిలోనూ గెలిచిన కివీస్... ఇండియాపై ఓ పాయింట్ సాధిస్తే, సెమీ ఫైనల్‌కి వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. ఆ తర్వాతి ఐదు మ్యాచ్‌లలో మూడు గెలిస్తే... టాప్‌కి వెళ్లే అవకాశాలుంటాయి.
Loading...
ఇప్పటికే బలంగా ఉన్న టీంఇండియా జట్టు మాత్రం వర్షం పడితే, ఓ పాయింట్ కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన 7 మ్యాచుల్లో న్యూజిలాండ్‌ని ఇండియా... ఆరుసార్లు ఓడించింది. అదీ కాక ట్రెంట్ బ్రిడ్జిలో న్యూజిలాండ్... ఐదు వన్డేలు ఆడి... ఒకటి మాత్రమే గెలిచింది. ఇవాళ్టి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కి గెలుపు అవకాశాలు 28.57 శాతమే ఉన్నాయంటున్నారు. అందువల్ల వర్షం పడకుండా ఉండాలని కోరుకుందాం.

 

ఇవి కూడా చదవండి :

పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా... ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే

ఎంతకీ బరువు తగ్గలేకపోతున్నారా?... రోజూ ఇది తాగండి... తేడా కనిపిస్తుంది... ప్రకృతి వరం

ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...

రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...
First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...