వార్నీ... ఏం కొట్టాడ్రా... మైండ్ బ్లోయింగ్ షాట్...

Cristiano Ronaldo : ఫుట్‌బాల్‌లో ఆటగాళ్లు మెరుపులా కదులుతారు. వాళ్లు వేసే ఎత్తుగడల్ని డైరెక్టుగా చూస్తే ఈజీగా కనుక్కోలేం. అదే స్లోమోషన్‌లో చూస్తే మైండ్ పోతుంది. ఇది అలాంటిదే.

news18-telugu
Updated: December 21, 2019, 8:05 AM IST
వార్నీ... ఏం కొట్టాడ్రా... మైండ్ బ్లోయింగ్ షాట్...
వార్నీ... ఏం కొట్టాడ్రా... మైండ్ బ్లోయింగ్ షాట్... (credit - twitter - Babalola E Temitope)
  • Share this:
ఒక్క గోల్... అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాంటి గోల్ ఎవరూ చెయ్యలేరనీ... చివరకు మెస్సీ వల్ల కూడా కాదని నెటిజన్లు మెచ్చుకునే పరిస్థితి. క్రిస్టియానో రొనాల్డో భూమ్యాకర్షణ శక్తిని కూడా ఓడించాడని ఓ నెటిజన్ కామెంట్ చేశారంటే... అది ఎంత అద్భుతమైన షాటో ఊహించుకోవచ్చు. మైదానంలో మెరుపులా కదులుతూ... ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన రొనాల్డో... ఫుట్‌బాల్‌ని తలతో తన్ని... గోల్ సాధించాడు. గోల్ కీపర్ కూడా ఈ రకమైన షాట్‌ను ముందుగా ఊహించలేకపోయాడు. అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే... 34 ఏళ్ల రొనాల్డో గాల్లో అలా ఎలా ఎగరగలిగాడా అన్నదే. సహజంగా మనం గాల్లోకి ఎగరగానే... వెంటనే కిందకు దిగిపోతాం. కారణం భూమ్యాకర్షణ శక్తి. రొనాల్డో మాత్రం... గాల్లోకి అలా ఎగురుతూ పైకి వెళ్లిపోవడం షాకింగ్ తెప్పించే సీన్. ఈ షాట్‌తో మెస్సీ, రొనాల్డోల్లో ఎవరు గొప్ప అనే చర్చ మళ్లీ మొదలైంది.

ఇప్పుడీ గోల్‌పై ఒకటే ప్రశంసలు. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక్క చిన్న వీడియో క్లిప్ వైరల్ అయిపోయింది. దీనిపై మెమెస్, కామెంట్ల తుఫాన్ వస్తోంది.First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు