టాస్ బదులు ట్విట్టర్ పోల్... ఫోర్ కొడితే 8, సిక్స్ కొడితే 12... ఇది ఏప్రిల్ ఫూల్ కాదు... ఐసీసీ నిర్ణయాలు

April Fool’s Day : ఏప్రిల్ ఫూల్ నాడు ఎవరూ కీలక నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఎవరూ నమ్మరు కాబట్టి. ఐసీసీ మాత్రం సంచలన నిర్ణయాలు తీసుకుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 2, 2019, 8:28 AM IST
టాస్ బదులు ట్విట్టర్ పోల్... ఫోర్ కొడితే 8, సిక్స్ కొడితే 12... ఇది ఏప్రిల్ ఫూల్ కాదు... ఐసీసీ నిర్ణయాలు
ఐసీసీ ప్రతిపాదన (Image : Twitter)
  • Share this:
టెస్ట్ క్రికెట్‌ను మరింత ఎక్కువ మంది అభిమానులకు చేరువ చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక మార్పులు చేస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలయ్యే ముందు ఈ మార్పులు చెయ్యబోతున్నట్లు ట్విట్టర్‌లో తెలిపింది. అంటే జులై 2019, జూన్ 2021 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచి ఈ మార్పులు జరగబోతున్నాయి. టెస్టుల్లో ఆటగాళ్లు తమ జెర్సీలపై వాళ్ల ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌ను ఉంచే అవకాశాలున్నాయి. ప్లేయర్ల వాట్సాప్ నంబర్లను కూడా వేస్తే బాగుంటుందనే ప్రతిపాదన ఫ్యాన్స్ నుంచీ వస్తోంది. అలాగే... కాయిన్‌తో వేసే టాస్‌కి రద్దు చేసి... దాని బదులుగా ట్విట్టర్‌లో నిర్వహించబోతోంది. ఫలితంగా ముందు ఎవరు బ్యాటింగ్ చెయ్యాలో, ఎవరు బౌలింగ్ చెయ్యాలో ఫ్యాన్సే డిసైడ్ చేస్తారు.కామెంటరీలో కూడా మార్పులు జరగబోతున్నాయి. గ్రౌండ్ బయట ఎక్కడో ఏసీ రూముల్లో ఉండి కామెంటరీ చెప్పడం కాదు... డైరెక్టుగా ఫీల్డ్‌లోనే స్లిప్ ఫీల్డర్ వెనక నిలబడి రన్నింగ్ కామెంటరీ చెప్పొచ్చనే ప్రతిపాదన ఉంది.

ఒకే బంతికి రెండు వికెట్లు తీసే ఛాన్సుంటే బౌలర్లకు పండగే. ఇదెలాగంటే... బ్యాట్స్‌మన్ నుంచీ వచ్చిన బాల్‌ని క్యాచ్ చేసి... దానితో అవతలి బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేసే ఛాన్స్ ఇకపై రాబోతోంది.
బ్యాట్స్‌మన్‌ను సంతృప్తి పరిచేందుకు... ఫోర్ కొడితే 8, సిక్స్ కొడితే 12 రన్స్ ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది. నోబాల్‌ను ఫాల్ట్ అని, డాట్ బాల్‌ను ఏస్‌ అని పిలుస్తామని ఐసీసీ చెప్పింది.ఈ ప్రతిపాదనల్లో చాలా వాటికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ... యాషెస్ మ్యాచ్ నుంచీ అమలు చెయ్యాలనుకుంటోంది. తద్వారా టెస్ట్ క్రికెట్‌కి ఎక్కువ ప్రచారం కల్పించబోతోంది.ఇవి కూడా చదవండి :

భర్తపై దాడి చేసి... భార్యను గ్యాంగ్ రేప్ చేసి... హర్యానాలో నడిరోడ్డుపై అరాచకం...

భర్త నిక్ జోనాస్‌పై అభిమాని బ్రా విసిరితే... గాల్లో ఊపి సందడి చేసిన ప్రియాంక చోప్రా

ఒక్క మహిళ కోసం పోలింగ్ బూత్... ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే...

ప్రతిపక్షాల విమర్శలే తమ నినాదాలు... బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ... అధికార పార్టీల కొత్త ఎత్తుగడ
Published by: Krishna Kumar N
First published: April 2, 2019, 8:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading