• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • NORTH KOREA OPTED OUT FROM TOKYO OLYMPICS NATIONAL OLYMPIC COMMITTEE DECIDED JNK

Tokyo Olympics : టోక్యో ఒలంపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నార్త్ కొరియా.. కారణం ఏంటో తెలుసా?

Tokyo Olympics : టోక్యో ఒలంపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నార్త్ కొరియా.. కారణం ఏంటో తెలుసా?

Olympics (ఫైల్ ఫోటో)

  • Share this:
    టోక్యో ఒలంపిక్స్‌లో (Tokyo Olympics) తమ దేశపు అథ్లెట్లు పాల్గొనబోరని.. అన్ని రకాల క్రీడలకు సంబంధించిన ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్లు నార్త్ కొరియా (North Korea) ప్రకటించింది. ఉత్తర కొరియాకు చెందిన డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ (డీపీఆర్) కొరియా (DPR Korea) అనే వెబ్‌సైట్‌లోని స్పోర్ట్స్ కాలమ్‌లో టోక్యో ఒలంపిక్స్‌కు సంబంధించిన కీలక నిర్ణయం గురించి వెల్లడించారు. మార్చి 25న జరిగిన నేషనల్ ఒలంపిక్ కమిటీ (National Olympic Committee) సమావేశంలో అథ్లెట్ల ఆరోగ్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్యం కోవిడ్ - 19 కారణంగా సంక్షోభంలో ఉన్నదని.. అధ్యక్షుడు కిమ్ జోంగ్ కూడా జపాన్‌లో జరిగే ఒలంపిక్స్‌కు తమ దేశ అథ్లెట్లు వెళ్లడానికి ఇష్టపడటం లేదని సమాచారం. కోవిడ్ కారణం చూపించి అథ్లెట్లను దూరం పెట్టిందని అసలు కారణం వేరే ఉన్నదని అంతర్జాతీయ మీడియా అంటున్నది. నార్త్ కొరియా క్రీడా శాఖ నడిపించే ఈ వెబ్‌సైట్ ఒలంపిక్ కమిటీ నిర్ణయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఉత్తర కొరియా చివరి సారిగా 1988లో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన ఒలంపిక్స్‌ను బహిష్కరించింది.

    అప్పట్లో ఇరు దేశాల మధ్య ప్రచ్చన్న యుద్దం జరుగుతుండటంతో తమ అథ్లెట్లను పంపడానికి నార్త్ కొరియా తిరస్కరించింది. అయితే 2018లో దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలంపిక్స్‌కు నార్త్ కొరియా 22 మంది అథ్లెట్లను పంపించింది. ఆ సమయంలో కేవలం 22 మంది అథ్లెట్లే కాకుండా వారితో పాటు 230 మంది ప్రభుత్వ అధికారులు, కళాకారులు, జర్నలిస్టులు దక్షిణ కొరియాకు వెళ్లారు. తాజాగా మరోసారి ఉత్తర కొరియా ప్రభుత్వం ఒలంపిక్స్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నది.





    కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా.. నార్త్ కొరియాలో మాత్రం తమ కోవిడ్ గణాంకాలను వెల్లడించలేదు. ఏడాది కాలంగా నార్త్ కొరియా నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు నిషేధించారు. ఇప్పుడు అథ్లెట్లను టోక్యో పంపిస్తే దేశంలోని పరిస్థితిని బయటకు వెల్లడిస్తారేమో అని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు రాస్తున్నాయి. మరోవైపు నార్త్ కొరియా ప్రభుత్వంతో మాట్లాడటానికి అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు