Home /News /sports /

NO VIRAT KOHLI IN INDIAS SQUAD FOR WEST INDIES T20IS ROHIT SHARMA TO LEAD SJN

Virat Kohli : విరాట్ కోహ్లీపై వేటు వేసిన బీసీసీఐ.. విండీస్ తో జరిగే సిరీస్ కు నో.. కెప్టెన్ గా రోహిత్..

PC : TWITTER

PC : TWITTER

Virat Kohli : అనుకున్నదే జరిగింది. ఈ ఏడాది పూర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli)పై బీసీసీఐ (BCCI) సెలెక్టర్లు వేటు వేశారు. చేతన్ శర్మ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ గురువారం వెస్టిండీస్ (Westi Indies)తో జరిగే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఇందులో కోహ్లీని ఎంపిక చేయలేదు.

ఇంకా చదవండి ...
Virat Kohli : అనుకున్నదే జరిగింది. ఈ ఏడాది పూర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli)పై బీసీసీఐ (BCCI) సెలెక్టర్లు వేటు వేశారు. చేతన్ శర్మ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ గురువారం వెస్టిండీస్ (Westi Indies)తో జరిగే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఇందులో కోహ్లీని ఎంపిక చేయలేదు. సీనియర్లకు విశ్రాంతి కల్పిస్తారని అంతా భావించినా.. రోహిత్ శర్మ (Rohit sharma)ను కెప్టెన్ గా చేసింది. గాయంతో దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) మళ్లీ పునరాగమనం చేశాడు. అతడు రోహిత్ కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. సెలెక్షన్ కమిటీ మొత్తం 18 మందితో టీమ్ ను ప్రకటించింది. గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ లు ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. వారు విఫలం అయితే ఈ సిరీస్ లో ఆడేది లేదు. ఇప్పటికే వెస్టిండీస్ తో జరిగే మూడు వన్డేల కోసం టీమిండియా జట్టును ప్రకటించగా.. దానికి శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

ఇది కూడా చదవండి : కోహ్లీని మానసికంగా దెబ్బ తీసి.. ఇప్పుడు వెన్న రాస్తున్నావా గంగూలీ! ఫామ్ పై ఏమన్నాడంటే?

ఇక ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ తో జరిగిన టి20 సిరీస్ లో ఆడిన భారత జట్టునే దాదాపుగా సెలెక్ట్ చేశారు. 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ మాలిక్ ను ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. జస్ ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చహల్, మొహమ్మద్ షమీలకు ఈ సిరీస్ నుంచి బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. ఇక చాలా రోజుల తర్వాత రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ టి20ల్లో చోటు దక్కించకోవడం విశేషం. కెరీర్ దాదాపుగా ముగిసిందనుకున్న స్టేజ్ లో అశ్విన్
మళ్లీ టి20ల్లో చోటు దక్కించుకోవడం వింతనే చెప్పాలి.



షెడ్యూల్ ఇదే

వన్డేలు

జూలై 22న : తొలి వన్డే

జూలై 24న  :  రెండో వన్డే

జూలై 27న  :  మూడో వన్డే

టి20లు

జూలై 29  :  తొలి టి20

ఆగస్టు 1  :  రెండో టి20

ఆగస్టు 2  : మూడో టి20

ఆగస్టు 6  :  నాలుగో టి20

ఆగస్టు 7  :  ఐదో టి20

జట్టు వివరాలు

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవుశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు