విరాట్ కోహ్లీకి ‘నో ఓవర్ స్పీడ్ చలాన్’... ముంబై పోలీస్ ట్వీట్ వైరల్!

‘విరాట్‌కి నో ఓవర్ స్పీడింగ్ చలాన్... కేవలం అభినందనలు, ప్రశంసలు...’ అంటూ వెరైటీగా శుభాకాంక్షలు తెలిపిన ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 25, 2018, 5:24 PM IST
విరాట్ కోహ్లీకి ‘నో ఓవర్ స్పీడ్ చలాన్’... ముంబై పోలీస్ ట్వీట్ వైరల్!
విరాట్ కోహ్లీ (twitter/ICC)
  • Share this:
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. వన్డేల్లో వేగంగా 10 వేల పరుగులను అధిగమించిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేసిన విరాట్... అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 37 సెంచరీలు నమోదుచేసిన క్రికెటర్‌గానూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 205 ఇన్నింగ్స్‌ల్లోనే కొహ్లీ 10 వేల పరుగుల మార్క్ దాటి వన్డే ఫార్మాట్‌లో హిస్టరీ క్రియేట్ చేశాడు. విశాఖ వన్డేలో 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనత సాధించిన ‘కింగ్ కోహ్లీ’, ‘క్రికెట్ గాడ్’గా పేరొందిన మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 259 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగుల మైలురాయి దాటిన రికార్డును తుడిచి పెట్టేశాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీకి అన్ని వర్గాల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది.

తాజాగా ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్ వినూత్నంగా విరాట్ కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేసింది. ‘విరాట్‌కి నో ఓవర్ స్పీడింగ్ చలాన్... కేవలం అభినందనలు, ప్రశంసలు... అమేజింగ్ ఫీట్ సాధించిన కోహ్లీకి శుభాకాంక్షలు’ అంటూ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు ముంబై పోలీసులు. ఈ ట్వీట్‌పై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు వినూత్నంగా అభినందించడం బాగుందంటూ ముంబై పోలీసులని అభినందిస్తూ... ఓ వైపు ముంబైలో రౌడీలు, గుండాలు పెరిగిపోతుంటే, మీరూ క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారా...అంటూ మరికొందరు నిందిస్తున్నారు.

ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్ పోస్ట్ చేసిన ట్వీట్ ఇదే...
First published: October 25, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>