క్రికెట్‌కీ చుట్టుకున్న CAA చిచ్చు... వాంఖడే స్టేడియంలో వినిపించిన నిరసనల హోరు...

దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టాన్ని సమర్థిస్తున్న వారు ఉన్నట్లే... వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. ఈ రెండు వర్గాలూ వీలైనన్ని చోట్ల... తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: January 15, 2020, 8:52 AM IST
క్రికెట్‌కీ చుట్టుకున్న CAA చిచ్చు... వాంఖడే స్టేడియంలో వినిపించిన నిరసనల హోరు...
క్రికెట్‌కీ చుట్టుకున్న CAA చిచ్చు... వాంఖడే స్టేడియంలో వినిపించిన నిరసనల హోరు... (credit - twitter - Mumbai Against CAB)
  • Share this:
పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనలు క్రికెట్‌కీ చుట్టుకున్నాయి. నిన్న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతున్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో నో NCR, నో NPR, నో CAA పేర్లతో కొంతమంది ఆందోళనకారులు... నిరసన చేశారు. వాళ్లంతా... TISS, ముంబై యూనివర్శిటీ, IIT బాంబేకి చెందిన 25 మంది కాలేజీ విద్యార్థులని తెలిసింది. వీళ్లంతా ఓ వైపు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే... స్టేడియంలో నిల్చొని... శాంతియుతంగా నిరసన తెలిపారు. వీళ్ల టీ షర్ట్స్‌పై ప్రత్యేక లెటర్స్ ఉండటంతో... ఈ నిరసన అందర్నీ ఆకర్షించింది. దీనికో కారణం ఉంది. స్టేడియంలో నిరసన ప్రదర్శనలు చేయడం నిషిద్ధం. ప్లకార్డులు ప్రదర్శించకూడదు. అందుకనే వీళ్లు తమ టీ షర్టులపై లెటర్స్ రాసుకొని... పక్క పక్కనే నిలబడి... తెలివిగా నిరసన తెలిపారు. ట్విస్ట్ ఏంటంటే... వీళ్లంతా స్టేడియం లోపలికి వచ్చేటప్పుడు... టీ షర్టులపై వేరే షర్ట్స్ వేసుకున్నారు. ఆట మంచి పట్టులో ఉన్నప్పుడు... 15 ఓవర్ల తర్వాత నుంచీ పై షర్టులు తొలగించారు. 20వ ఓవర్ జరిగే వరకూ తన నిరసన తెలిపారు. అప్పటికే వీళ్లు అందరి దృష్టిలోకీ వెళ్లిపోయారు. అన్ని మీడియా సంస్థలూ వీళ్లపై ఫోకస్ పెట్టేశాయి. నిరసనల్లో భాగంగా వీళ్లు భారత్ మాతాకీ జై, వందే మాతరం అనే స్లోగన్స్ మాత్రమే ఇచ్చి... తాము రూల్స్ ప్రకారమే నడుచుకున్నామని చెబుతున్నారు.
ఈ నిరసన విషయం తెలియగానే స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది... ఆ విద్యార్థుల దగ్గరకు వెళ్లి... అలాంటి టీ షర్ట్స్ చూపించవద్దనీ, వాటిని తొలగించాలని కోరారు. ఆ సమయంలో 20వ ఓవర్ నడుస్తోంది. తమను బయటకు పంపేస్తారేమోనన్న ఉద్దేశంతో ఆ స్టూడెంట్స్ తిరిగి వేరే షర్ట్స్ వేసేసుకున్నారు. నిజానికి ఈ మ్యాచ్ మొదలయ్యే టప్పుడే చాలా మంది బ్లాక్ షర్టులతో లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఐతే... స్టేడియం సిబ్బంది... బ్లాక్ షర్ట్స్‌ను లోపలికి అనుమతించలేదు.

జనవరి 10 నుంచీ దేశంలో పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం... 2014 డిసెంబర్ 31కి ముందు... పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌ వచ్చిన ముస్లిమేతరులంతా ఇప్పుడు భారతీయులకింద లెక్క.
First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు