• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • NITISH RANA HAD WIERD STATISTICS IN LAST SIX IPL MATCHES IN VERY ALTERNATE MATCH HE GOT DUCK OUT JNK

IPL 2021 : నితీశ్ రాణా.. అతడొక విచిత్రమైన క్రికెటర్.. ఐపీఎల్ గణాంకాలు చూస్తారా?

IPL 2021 : నితీశ్ రాణా.. అతడొక విచిత్రమైన క్రికెటర్.. ఐపీఎల్ గణాంకాలు చూస్తారా?

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ నితీశ్ రాణా సన్‌రైజర్స్‌పై 80 పరుగులు చేశాడు. అతడి గత ఐపీఎల్ ఇన్నింగ్స్ ఎలా సాగాయో చూస్తారా? [PC : iplt20.com]

  • Share this:
    సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) భారీ స్కోర్ సాధించడంలో ఆ జట్టు ఓపెనర్ నితీశ్ రాణా బ్యాటింగే కారణం. కేవలం 56 బంతుల్లో 80 పరుగులు చేసి కోల్‌కతా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, నితీశ్ రాణాలో మంచి టెక్నిక్, ఏ బౌలర్‌ను అయినా ఎదుర్కునే సామర్థ్యం ఉన్నా అతడి ఆటలో మాత్రం నిలకడ ఉండదు. ఐపీఎల్ (IPL 2021) గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టంగా అర్దమవుతాయి. గత ఆరు ఐపీఎల్ ఇన్నింగ్స్ పరిశీలిస్తే.. ఒక మ్యాచ్‌లో భారీ స్కోర్ కొడితే.. మరో మ్యాచ్‌లో డకౌట్ అవుతున్నాడు. పరుగులు బాదిన ప్రతీసారి 80కిపైగా పరుగులు చేస్తే.. మిగతా మ్యాచ్‌లలో మాత్రం తొలి బంతికే డకౌట్ అవుతున్నాడు. ఇలాంటి విచిత్రమైన గణాంకాలు మరే ఇతర క్రికెటర్‌కు ఉండవని విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

    నితీశ్ రాణా గత 6 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో వరుసగా 0(1), 81(53), 0(1), 87(61), 0(1), 80(56) స్కోర్ చేశాడు. ఆడితే అర్దసెంచరీ కొట్టడం లేదంటే తొలి బంతికే పెవీలియన్ చేరడం రాణాకు అలవాటుగా మారింది. ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలంటే రాబోయే మ్యాచ్‌లో నితీశ్ రాణా తప్పకుండా పరుగులు సాధించాల్సి ఉంటుంది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా రాణా బ్యాటింగ్‌ను మెచ్చుకున్నాడు. అతడిలో అద్భుతమైన టెక్నిక్ ఉందని.. ఒకసారి క్రీజులో కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు చెన్నైలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌లో ఎక్కువగా సాధన చేశాడని చెప్పాడు. రాణా వద్ద క్రికెట్ బుక్‌లోని షాట్లు అన్నీ ఉన్నాయన్నాడు.

    మరోవైపు కోచ్ బ్రెండెన్ మెకల్లమ్ కూడా నితీశ్ రాణాను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే రాణా కరోనా బారిన పడ్డాడు. దాని నుంచి త్వరగానే కోలుకున్న నితీశ్.. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేసినట్లు చెప్పాడు. అతడు కరోనాకు ముందు ఎంత ఫిట్‌గా ఉన్నాడో.. ఆ తర్వాత కూడా అంతే ఆరోగ్యంతో ఉన్నట్లు మెక్‌కల్లమ్ చెప్పాడు. నితీశ్‌లో చాలా కష్టపడే మనస్థత్వం ఉందని.. కాకపోతే ఇటీవల కాలంలో అతడి గణాంకాలు పరిశీలిస్తే కాస్త ఆందోళనకరంగా ఉందన్నాడు. అయితే గణాంకాలనే చూసి నితిశ్ టాలెంట్‌ను తక్కువగా అంచనా వేయలేమని కోచ్ చెప్పుకొచ్చాడు. మరి రాణా రాబోయే మ్యాచ్‌లో డకౌట్ అయ్యి తన విచిత్రమైన ఫామ్‌ను కొనసాగిస్తాడా లేదో చూడాలి.
    Published by:John Naveen Kora
    First published: