క్రీడలు మనల్ని ఆహ్లాదంగా ఉండేలా చేస్తాయని, మనలో స్పూర్తి నింపడంతో పాటు ఒక్క చోటకు చేర్చుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ(Nita Ambani) అన్నారు. క్రికెట్, ఐపీఎల్ దేశంలో అత్యుత్తమ క్రీడగా మారిందని.. అందుకే ఐపీఎల్‌తో(IPL) మన బంధం బలపడుతోందని తెలిపారు. క్రికెట్ లవర్స్ ఎక్కడ ఉన్నా.. వారికి ఐపీఎల్ యొక్క సంతోషమైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌ను వయాకామ్ 18 సొంతం చేసుకుంది. 2023 నుంచి 2027 జరిగే సీజన్లకు సంబంధించిన హక్కులను సొంతం చేసుకున్న Viacom 18.. ప్రతి సీజన్‌లో 18 గేమ్స్‌కు సంబంధించిన డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీని కూడా దక్కించుకుంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు అంతర్జాతీయ ప్రాంతాల్లోని మూడు ప్రాంతాల్లో వయాకామ్ 18 టీవీ హక్కులతో పాటు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందులో పలు క్రికెట్ ఆడే దేశాలు కూడా ఉన్నాయి. ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థలను వెనక్కి నెట్టి వయాకామ్ 18 డిజిటల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్స్ విభాగంలో దూసుకుపోతోంది. ఐపీఎల్ హక్కులను సొంతం చేసుకోవడం ద్వారా దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి వయాకామ్ 18 ఈ పెద్ద ఈవెంట్‌ను తీసుకెళ్లనుంది.
Viacom18 సాంప్రదాయ టెలివిజన్ ప్రసారాలను బలపర్చనుంది. భవిష్యత్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను మరింత ముందుకు తీసుకెళ్లనుంది. వందల మిలియన్ల మంది భారతీయ, ప్రపంచ వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి ఇది అధునాతన డిజిటల్ సదుపాయాన్ని కలిగిస్తుంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి కస్టమర్‌కు సకాలంలో సంబంధిత కంటెంట్‌ను అందించడానికి అవసరమైన డేటా, అల్గారిథమ్‌లను ఉపయోగించుకుంటాయి.
Ishan Kishan : వారెవ్వా ఇషాన్ ఇరగదీశావ్ .. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..
Rishabh Pant : బాబు పంత్ ఇలా అయితే కష్టమే సుమీ.. ఈ లెక్కలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది..!
Viacom18 సాకర్ (FIFA వరల్డ్ కప్, లా లిగా, సీరీ A మరియు Ligue1), బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ (NBA) క్లెయిమ్ చేసిన తర్వాత మొదటిసారి క్రికెట్ హక్కులను కూడా పొందింది. IPL డిజిటల్ హక్కులు Viacom18, దాని ప్లాట్‌ఫారమ్‌లను దేశంలోని అతిపెద్ద క్రీడా వేదికలలో ఒకటిగా మారుస్తాయనడంలో సందేహం లేదు. అలాగే పెద్ద, చిన్న ప్రేక్షకులను చేరుకోవడానికి ప్రకటనకర్తలకు ఇది ఒక ఏకైక అవకాశం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, Nita Ambani