క్రీడలు మనల్ని ఆహ్లాదంగా ఉండేలా చేస్తాయని, మనలో స్పూర్తి నింపడంతో పాటు ఒక్క చోటకు చేర్చుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ(Nita Ambani) అన్నారు. క్రికెట్, ఐపీఎల్ దేశంలో అత్యుత్తమ క్రీడగా మారిందని.. అందుకే ఐపీఎల్‌తో(IPL) మన బంధం బలపడుతోందని తెలిపారు. ఇప్పుడు మహిళల క్రికెట్ కు ఐపీఎల్ రూపంలో మంచి రోజులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల మహిళల ఐపీఎల్ (WPL Auction 2023).. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2023 వేలం ముగిసింది. 90 స్థానాల కోసం 409 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా.. ఐదు ఫ్రాంచైజీలు కలిసి 87 మందిని కొనుగోలు చేశారు. ఇక, ముంబై ఇండియన్స్ తరఫున ఈ వేలంలో నీతా అంబానీ.. ఆకాష్ అంబానీతో కలిసి పాల్గొన్నారు. ఈ మహిళల వేలంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళల క్రికెట్ కు ఇదొక మంచి సమయం అంటూ నీతా అంబానీ వ్యాఖ్యానించారు. " “వేలంపాటలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. కానీ ఈరోజు నిజంగా ప్రత్యేకమైనది. మహిళల ఐపీఎల్ కోసం ఇది మొదటి వేలం. కాబట్టి ఈరోజు నిజంగా చారిత్రాత్మకమైన రోజు. మహిళ క్రికెటర్ల ప్రతిభకు ఇది ఒక సరైన వేదిక " అంటూ ఆమె మాట్లాడారు.
“ఒక జట్టుగా, వేలం ముగిసిన విధానంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కి ముంబై ఇండియన్స్ లోకి ఆహ్వానం. జట్టులో నాట్ స్కివర్, పూజ వస్త్రాకర్ తో మరెందరో టాలెంటెడ్ మహిళ క్రికెటర్లు చేరడం ఎంతో సంతోషంగా ఉంది " అని ముంబై మహిళల జట్టును ఉద్దేశించి వ్యాఖ్యానించారు నీతా అంబానీ.
అలాగే.. టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, హర్మన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. " రోహిత్ (శర్మ) ముంబై ఇండియన్స్‌లో ఆటగాడి నుండి కెప్టెన్‌గా ఎదగడం చూశాను మరియు ఈ సంవత్సరం రోహిత్ శర్మ, మాకు ఎంతో ప్రత్యేకం. వచ్చే సీజన్ తో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా రోహిత్ పదేళ్లు పూర్తి చేసుకుంటాడు. ఈ సమయంలో మరో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ముంబై జట్టులో చేరడం ఎంతో సంతోషంగా ఉంది " అంటూ తెలిపారు నీతా.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో భాగమైన తొలి భారతీయ మహిళగా నీతా అంబానీ గుర్తింపు పొందారు. అంతేకాకుండా దేశంలో ఎన్నో క్రీడలకు ఆమె మద్ధతు ఇస్తారు. ఉత్సావంతులైన క్రీడాకారులకు ఆసరగా నిలుస్తున్నారు నీతా అంబానీ. Reliance Foundation ద్వారా ఎంతో మంది మహిళల్ని క్రీడల్లో ఎదిగేలా ప్రోత్సాహిస్తున్నారు. " భారతదేశంలో.. ప్రస్తుతం మహిళలు క్రీడల్లో సత్తా చాటుతున్నారు. మా ఫాండేషన్ తరఫున ఎంతో మంది అమ్మాయిలు క్రీడా రంగంలో అదరగొడుతున్నారు. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. రాబోయే రోజుల్లో మహిళలు ఈ రంగంలో మరింత ప్రొత్సాహం అందించేలా కృషి అందిస్తాం " అంటూ నీతా అంబానీ తెలిపారు.
ఇక.. మహిళల ముంబై ఇండియన్స్ జట్టుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ ముంబై చీఫ్ కోచ్‌గా నియమితురాలైంది. మరో సీనియర్ క్రికెటర్ జులన్ గోస్వామిని మెంటార్ గా ముంబై ఇండియన్స్ నియమించుకుంది. మెంటార్‌షిప్ తో పాటు బౌలింగ్ కోచ్‌గానూ జులన్ బాధ్యతలు నిర్వర్తించనుంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ దేవికా పాల్షీకర్ బ్యాటింగ్ కోచ్‌గా, తృప్తీ భట్టాచార్య ముంబై జట్టు మేనేజర్‌గా వ్యవహరించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akash Ambani, Cricket, Mumbai Indians, Nita Ambani, Rohit sharma, WPL 2023