జస్ప్రిత్ బుమ్రా .. టీమిండియా యంగ్ క్రికెటర్. ఐపీఎల్ మ్యాచులతో క్రికెట్ అభిమానులకు పరిచయం అయ్యాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడి ... మైదానంలో తనెంటో అన్న విషయం అందరికీ తెలిసేలా చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో తనకంటూ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న యంగ్ క్రికెటర్ బుమ్రా. తాజాగా అంతర్జాతీయ క్రీడల వ్యాపారం, అందులో కార్పోరేట్ బాధ్యత అనే అంశంపై లండన్లో జరిగిన స్పోర్ట్ బిజినెస్ సమ్మిట్ లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్పీత్ బుమ్రాను ఆమె కొనియాడారు. బూమ్రా వంటి యంగ్ ఆటగాళ్లను ఎందరినో ముంబై ఇండియన్ టీం ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. టాలెంట్ అనేది ఎక్కడ్నుంచి ఎప్పుడైన వస్తుందన్నారు. జస్పీత్ బుమ్రా ఎలా క్రికెట్లో అడుగుపెట్టాడన్న దానిపై నీతా అంబాని ఓ డాక్యమెంటరీ ద్వారా సదస్సుకు హాజరైన వారికి చూపించారు.
జస్ప్రిత్ బుమ్రా ఐదేళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. అప్పట్నుంచి అతని కుటుంబం ఎన్నో కష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక్క జత బట్టలు, షూలతోనే ఎన్నోరోజులు బతకాల్సి వచ్చింది. కానీ ఎవరూ ఒకరు మనలో ఉన్న ప్రతిభను తప్పక గుర్తిస్తారన్న నమ్మకం చిన్నప్పటి నుంచి తనలో ఉండేదని తెలిపాడు బుమ్రా. బుమ్రాను ఫస్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్లో చూసినప్పుడు తనను తాను నమ్మలేకపోయానని బూమ్రా తల్లి కళ్లలో నీళ్లు తిప్పుకుంటూ ఆనందం వ్యక్తంచేశారు. బూమ్రా దగ్గర ఇప్పుడు ఎన్నో రకాల షూ, బట్టలు ఉన్నాయన్నారు. ఇలా బూమ్రా జీవితంలో ఒడిదుడుకులకు సంబంధించిన వీడియోను నీతా అంబాని స్పోర్ట్స్ బిజినెస్ సమ్మిట్లో ప్రదర్శించారు.
ఈ రోజు బుమ్రా ఎంతోమంది యువత ఆదర్శమన్నారు నీతా అంబాని. గత పదేళ్ళలో హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా లాంటి ఎంతోమంది యువ ఆటగాళ్లను తెరపైకి తీసుకొచ్చామన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి యువకుడి, అమ్మాయి కలలు కని వాటిని నిజం చేసేందుకు ధైర్యం చూపాలన్నారు నీతా అంబాని.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.