NEWS T20 WORLD CUP 2022 WHAT IST TIMINGS MATCHES GH VB
T20 World Cup: T20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. భారత్‌లో మ్యాచ్‌ల టైమింగ్స్‌తో పాటు పూర్తి షెడ్యూల్ ఇదే..
ప్రతీకాత్మక చిత్రం (Image:Gletty)
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC). పురుషుల క్రికెట్ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఈ టోర్నీ జరగనుంది.
క్రికెట్ (Cricket) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC). పురుషుల క్రికెట్ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఆస్ట్రేలియా(Australia) వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఈ టోర్నీ జరగనుంది. తొలిపోరు స్కాట్లాండ్-నమీబియా(Scottland-Nameebia), వెస్టిండీస్-శ్రీలంకల(West Indies - Srilanka) మధ్య అట్టహాసంగా మొదలవుతుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ మ్యాచ్‌లు భారత్‌లో స్ట్రీమింగ్ అయ్యే సమయాలు తెలుసుకోండి. కరోనా కారణంగా 2021-టీ20 ప్రపంచకప్‌లో(World Cup) ఆగిపోయిన సూపర్-12 మ్యాచ్‌లు అక్టోబర్ 22నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రౌండ్లో గ్రూప్-1 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లు తలపడుతున్నాయి. ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ సైతం ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లు గ్రూప్-2లో ఉన్నాయి.
భారత్‌లో స్ట్రీమింగ్ టైమింగ్స్
అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు జరిగే 2022-T20 మ్యాచ్‌ల్లో తొలి గేమ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30కు మొదలవుతుంది. రెండో మ్యాచ్ మధ్యాహ్నం 1:30కు ఉంటుంది. ఆస్ట్రేలియాలో వేర్వేరు సమయాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. సిడ్నీలో సాయంత్రం 6 గంటలకు జరిగే మ్యాచ్‌ను భారత్‌లో మధ్యాహ్నం 12:30 గంటలకు వీక్షించవచ్చు. పెర్త్‌లో సాయంత్రం 7కి జరిగే మ్యాచ్ మనకు ఇక్కడ సాయంత్రం 4:30కి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం పూర్తి షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.