Home /News /sports /

NEWS IPL AUCTION 2022 AHMEDABAD OVERTAKES LUCKNOW SEND IPL CONTRACT RASHID KHAN VB

Rashid Khan: రషీద్ ఖాన్ కోసం రెండు ఫ్రాంచైజీలు పోటాపోటీ.. ఏ జట్టుతో జత కట్టనున్నాడు..? వివరాలిలా..

Rashid Khan

Rashid Khan

Rashid Khan: రషీద్ ఖాన్.. అప్ఘనిస్థాన్ క్రికెట్ ప్లేయర్. ఐపీఎల్ లో ఇతడికి మంచి రికార్డు ఉంది. మన హైదరాబాద్ ఫ్రాంచైజీకి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి సుదీర్ఘకాలం ఆడిన ఆటగాడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు స్పిన్ బౌలింగ్ లోనే కాదు.. అటు బ్యాటింగ్ లో కూడా ఓ ఊపు ఊపేస్తాడు.

ఇంకా చదవండి ...
రషీద్ ఖాన్.. అప్ఘనిస్థాన్ క్రికెట్ ప్లేయర్(Cricket Player). ఐపీఎల్(IPL) లో ఇతడికి మంచి రికార్డు ఉంది. మన హైదరాబాద్ (Hyderabad) ఫ్రాంచైజీకి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి (Sunrisers Hyderabad) సుదీర్ఘకాలం ఆడిన ఆటగాడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు స్పిన్ బౌలింగ్ (Spin Bowling) లోనే కాదు.. అటు బ్యాటింగ్ (Batting)లో కూడా ఓ ఊపు ఊపేస్తాడు. ఎన్నో సార్లు సన్ రైజర్స్ హైదరాబాద్ ను తక్కువ బాల్స్(Balls) లో ఎక్కువ రన్(Runs) చేసి గెలిపించాడు. ఇలా అతడు ఐపీఎల్ లో చూపించిన ప్రతిభ కారణంగానే అతడిని తీసుకోడానికి ప్రాచైంజీలు పోటీ పడుతుంటాయి. అయితే ఈ సారి సన్ రైజర్స్ హైదరాబాద్ కు రశీద్ ఖాన్ ఆడటం లేదు. దీనిలో భాగంగానే అతడు ఐపీఎల్ వేలానికి వచ్చాడు.

ICC U19 World Cup: కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న మినీ సంగ్రామం..ఫేవరెట్ బరిలో భారత్ .. పూర్తి వివరాలివే..


ఐపీఎల్ 2021 సీజన్‌‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రషీద్ ఖాన్‌కి(Rashid Khan) రూ.9 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు అతడికి రూ. 11 కోట్లు ఇచ్చేందుకు రెండు ఫ్రాచైంజీలు పోటీలు పడుతున్నాయి. మరో విషయం ఏంటంటే.. గత రెండు నెలలుగా రశీద్ ఖాన్ ను ఈ సారి చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసిన లక్నో ఫ్రాంఛైజీ అనూహ్యంగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాంతో.. మరో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్ ఈ అఫ్గాన్ స్పిన్నర్‌‌పై కన్నేసి.. భారీ ధరని ఆఫర్ చేస్తోందట. ఈ ఏడాది 10 జట్లతో ఐపీఎల్ జరగనుండగా.. కొత్తగా టోర్నీలోకి లక్నో, అహ్మదాబాద్ జట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆటగాళ్ల వేలం ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్న వాళ్లకు.. ఫిబ్రవరిలో12, 13 తేదీల్లో ఎవరు ఎటు వెళ్తారో తెలియనుంది.

ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లు తమ ఫ్రాచైంజీలకు అంటిపెట్టుకొని ఉండగా.. వేలానికి తాము సిద్ధం అన్నట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రషీద్ ఖాన్ కోరిక మేరకు అతడ్ని వేలానికి విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అందుకే ప్రస్తుతం అతడిని దక్కించుకునేందుకు రెండు ఫ్రాచైంజీలు పోటీ పడుతున్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రశీద్ ఖాన్ ను వేలానికి విడిచిపెట్టకముందే లక్నో ఫ్రాంఛైంజీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అతడికి రూ.15 కోట్ల ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అనుకోకుండా.. అనూహ్యంగా అహ్మదాబాద్ పేరు వినిపిస్తోంది. అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

IPL 2022: ఐపీఎల్ ప్రేమికులకు ఈ సారి కూడా నిరాశే.. ఆ సందడి ఇక అక్కడ నుంచే.. వివరాలిలా..


ఇక రూ.33 కోట్లను లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీలకి బీసీసీఐ వేలం ముంగిట ఉంచింది. ముగ్గురు ఆటగాళ్లలను తీసుకునే వెసులుబాటును కల్పించారు. దీనిలో భాగంగా.. ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్లకు రూ.15 కోట్లు, సెకండ్ క్లాస్ ప్లేయర్ కు రూ. 11 కోట్లు, సెకండ్ క్లాస్ ప్లేయర్ కు రూ. 7 కోట్ల చొప్పున చెల్లించాలని రూల్ పెట్టింది బీసీసీఐ. ఒక వేళ ఇద్దరు ప్లేయర్లను మాత్రమే తీసుకుంటే.. రూ.24 కోట్లు (14 కోట్లు, 10 కోట్ల చొప్పున) కేటాయిస్తారు. ఒక్కరే అయితే మాత్రం రూ.14 కోట్లు అతడికి చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్ని కాకుండా.. ఇంత వరకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడని ఆడగానికి అయితే రూ.4 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. ఇదిలా ఉండగా..లక్నో ఫ్రాచైంజీ ఇప్పటికే తమ ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్ గా కేయల్ రాహుల్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

University of Hyderabad: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్​లో ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా అప్లై చేసుకోండి


కేయల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు మాజీ కెప్టెన్ గా వహించిన విషయం తెలిసిందే. ఇక సెకండ్ క్లాస్ ప్లేయర్ కోసం రశీద్ ఖాన్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ కూడా ఇప్పటికే హార్దిక్ పాండ్యాని ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్‌గా ఎంచుకోవడం.. అతడికి కెప్టెన్సీ ఇవ్వడం కూడా జరిగిపోయిందని సమాచారం. ఇక సెకండ్ ఛాయిస్ ప్లేయర్‌గా రషీద్ ఖాన్‌‌ని ఎంచుకోబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి దీనిలో భాగంగానే అతడికి రూ.11 కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారట. థర్డ్ క్లాస్ ప్లేయర్ గా ఇషాన్ కిషన్ ను ఎంచుకకోగా.. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ విశ్వసనీయ సమాచారం.
Published by:Veera Babu
First published:

Tags: IPL, IPL 2022, Rashid Khan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు