టీమిండియా-ఆస్ట్రేలియాల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకూ జరిగిన రెండో వన్డేల్లో ఆసీస్ బాట్స్‌మెన్స్ పరుగుల సూనామి సృష్టించారు. వన్డే సిరీస్‌ను 0-2 తేడాతో ఆస్ట్రేలియా టోర్నీని కైవసం చేసుకుంది. నవంబర్ 27న ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేతో ప్రారంభమైన వన్డే సిరీస్ బుధవారంతో ముగియనుంది. కాన్బెర్రాలోని మనుకా ఓవల్‌లో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. నామాత్రపు చివరి వన్డే కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభం.. లైవ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకొండి!
వన్డే సీరిస్ ప్రారంభం కానున్న ఈ టోర్నీ.. ప్రారంభ రెండు మ్యాచ్‌లు నవంబర్ 27,29 తేదీల్లో సిడ్నీ క్రికెట్ మైదానంలో జరగనున్నాయి, చివరి వన్డే మ్యాచ్ డిసెంబర్ 2 న కాన్బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్‌ల కోసం అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Spsn) ఈ మ్యాచ్‌లను ప్రత్యేక్ష ప్రసారం చేస్తోంది. తెలుగు,తమిళం,హింది,ఇంగ్లీస్ భాషల్లో ఈ మ్యాచ్‌లను లైవ్‌గా చూడవచ్చు. ఆంగ్లంలో సోనీ టెన్ 1, హిందీలో సోనీ టెన్ 3 ఛానల్స్ ప్రత్యేక్ష ప్రసారం అందిస్తుండగా, ఇక సోనీ సిక్స్ తమిళ, తెలుగు వ్యాఖ్యానంతో మ్యాచ్‌లను లైవ్‌గా వీక్షించవచ్చు. అలాగే దూరదర్శన్‌లో మ్యాచ్‌లను చూడోచ్చు.
ALSO READ: Ind vs Eng: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్ - ఇంగ్లాండ్ సిరీస్‌లో మార్పులు..
మ్యాచ్ ప్రారంభ సమయం : ఉదయం 9:10 నిమిషాలకు మ్యాచ్ మెుదలవుతుంది
మూడో వన్డే: డిసెంబర్ 1 - మనుకా ఓవల్ సమయం: 9:10 AM
భారత్ x ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌ని ప్రసారం చేసే టీవీ ఛానెల్స్
సోనీ సిక్స్, సోనీ టెన్ 1 తో పాటు సోనీ టెన్ 3 లలో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. అలాగే సోనీ లివ్ యాప్‌లో కూడా మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఇండియా v ఆస్ట్రేలియా మ్యాచ్‌లను ప్రత్యేక్ష ప్రసారం చేసే ఛానల్స్
ఇండియా: సోనీ టెన్ 1, సోనీ టెన్ 2, సోనీ సిక్స్
ఆస్ట్రేలియా: ఫాక్స్ స్పోర్ట్స్
న్యూజిలాండ్: SKY స్పోర్ట్ NZ
యుకె: స్కై స్పోర్ట్స్ క్రికెట్
దక్షిణాఫ్రికా: సూపర్‌స్పోర్ట్
బంగ్లాదేశ్: గాజీ టీవీ
కెనడా: ATN క్రికెట్ ప్లస్
USA: విల్లో టీవీ, హాట్‌స్టార్
మలేషియా: ఆస్ట్రో క్రికెట్ హెచ్‌డి
మెనా (మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా) దేశాలు: OSN స్పోర్ట్స్ క్రికెట్ HD
లైవ్ స్ట్రీమింగ్: సోనీలివ్, స్కై గో, నౌ టీవీ
ALSO READ: ఎన్టీఆర్‌లా వార్నర్.. కత్తిపట్టిన స్టార్ బాట్స్‌మెన్.. వైరల్ వీడియో
కాగా, ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా వరుసగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది టీమిండియా. నవంబరు 27 నుంచి మూడు వన్డేలు, డిసెంబరు 4 నుంచి మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. అంతేకాదు ఆస్ట్రేలియాతో తొలిసారి డే/నైట్ టెస్టులో తలపడనుంది టీమిండియా. డిసెంబర్ 17-21 వరకు అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్ (26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్ (జనవరి 15-19)లో తదుపరి మ్యాచ్‌లు జరుగుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs Australia 2020, News