Home /News /sports /

NEWS ASHES 2021 SACHIN TENDULKAR REACTS BEN STOKES BIZARRE ESCAPE GH VB

Ashes Test: క్రికెట్ లో ఆ చట్టం తీసుకురావాలి.. యాషెస్ టెస్ట్ లో జరిగిన ఘటనపై సచిన్ స్పందన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆసీస్‌ బౌలర్‌ కామెరూన్ గ్రీన్‌(Cameron Green) 142 కి.మీ వేగంతో విసిరిన బంతికి ఇంగ్లాండ్‌ ఆల్రౌండర్ బెన్‌ స్టోక్స్‌(Ben Stokes) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈ సమయంలో బంతి స్టంప్స్‌ను తాకుతూ వెళ్లింది కానీ స్టంప్స్‌పై ఉన్న బెయిల్స్‌ మాత్రం కింద పడలేదు.

ఇంకా చదవండి ...
క్రికెట్‌లో(Cricket) అప్పుడప్పుడు చోటుచేసుకునే అద్భుతాలు ఒక్కోసారి అబ్బురపరిస్తే.. ఒక్కోసారి ఖంగు తినిపిస్తాయి. తాజాగా అలాంటి అసాధారణమైన ఘటన యాషెస్‌ సిరీస్‌(Ashes Series)లో భాగంగా ఆస్ట్రేలియా(Australia), ఇంగ్లాండ్‌(England) జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో వెలుగు చూసింది. సిడ్నీ(Sydney)లో జరిగిన ఈ సిరీస్‌లో ఆసీస్‌ బౌలర్‌ కామెరూన్ గ్రీన్‌(Cameron Green) 142 కి.మీ వేగంతో విసిరిన బంతికి ఇంగ్లాండ్‌ ఆల్రౌండర్ బెన్‌ స్టోక్స్‌(Ben Stokes) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈ సమయంలో బంతి స్టంప్స్‌ను తాకుతూ వెళ్లింది కానీ స్టంప్స్‌పై ఉన్న బెయిల్స్‌ మాత్రం కింద పడలేదు. దీనితో క్రికెట్ రూల్స్ ప్రకారం, బెన్‌ స్టోక్స్‌ నాటౌట్‌ అని అంపైర్లు డిక్లేర్ చేశారు. కొద్దిలో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడటంతో బెన్‌ స్టోక్స్‌ గట్టిగా ఊపిరి పీల్చుకుని నవ్వేశాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం షాకయ్యారు. ఈ అరుదైన ఎస్కేప్ క్రికెట్ అభిమానులందరికీ షాక్ ఇస్తోంది. ఈ క్రమంలో దీనిపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు.

IPL 2022 Auction: కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ 2022 ప్లాన్ మార్చిన బీసీసీఐ..


ఈ మిరాకిల్ సేవ్ తర్వాత సచిన్ ట్విట్టర్ వేదికగా ఒక చట్టం తీసుకురావాలంటూ పేర్కొన్నారు. బంతి వికెట్స్‌ను సంధించినా బెయిల్స్‌ కింద పడనప్పుడు దాన్ని ఔట్‌గా డిక్లేర్ చేయాలా? లేదా? అనేది నిర్ణయించడానికి 'హిట్టింగ్‌ ది స్టంప్స్' అనే చట్టం తీసుకురావాలని సచిన్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ రూల్స్ ప్రకారం.. హిట్‌ వికెట్, బౌల్డ్‌, రనౌట్, స్టంపౌట్‌ అయిన సమయంలో వికెట్ల పైనుంచి బెయిల్స్‌ కింద పడాలి. అయితే యాషెస్‌ టెస్టులో అలా జరగకపోవడంతో బెన్‌ స్టోక్స్‌ లక్కీగా నాటౌట్‌గా నిలిచి బతికిపోయాడు. దీనివల్ల బెన్ క్లీన్ బౌల్డ్ అయినప్పటికీ.. ఆసీస్ బౌలర్ కామెరూన్ గ్రీన్‌కు నిరాశే ఎదురయింది. అయితే ఇలాంటి సంఘటనల కోసం అనే కొత్త చట్టాన్ని తీసుకురావాలా? అని సచిన్ ప్రతిపాదన చేశారు. దీంతో బౌలర్లకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్‌లో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్‌గా మారాయి."ఏదైనా ఓ బంతి స్టంప్స్‌కు తగిలిన తర్వాత బెయిల్స్‌ కింద పడకపోతే.. అది ఔటా? లేదా? అనేది తేల్చేందుకు 'హిట్టింగ్‌ ది స్టంప్స్' అనే చట్టాన్ని తీసుకురావాలి. మీరు ఏమనుకుంటున్నారు గాయ్స్? బౌలర్లకు న్యాయం చేద్దాం!" అని సచిన్ దీనిపై ఒక చర్చకు తెరలేపారు. సచిన్ తో షేన్ వార్న్‌ ఏకీభవించారు.

ఈ అద్భుతం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు 31వ ఓవర్‌లో మొదటి బంతి బౌల్ చేసినప్పుడు జరిగింది. స్టోక్స్ అప్పటికే 16 (37) పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో కామెరూన్ విసిరిన బంతిని స్టోక్స్ వదిలేశాడు. ఆ బంతి కాస్త నిప్-బ్యాకర్(nip-backer)గా మారి ఆఫ్‌ స్టంప్‌ని తాకింది కానీ బెయిల్స్‌ కిందపడలేదు. ఈ సమయంలో వికెట్ కీపర్ బంతిని క్యాచ్ పట్టుకున్నాడు. ఇదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసింది. దీన్ని ఆన్-ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫిల్ ఔట్ అని ప్రకటించారు. అయితే తన ప్యాడ్స్ కు బంతి అసలు తాకలేదని బెన్ స్టోక్స్ డెసిషన్ రివ్యూ సిస్టమ్(DRS) రివ్యూ కోరాడు. రివ్యూ చేశాక బెన్ స్టోక్స్ నాటౌట్‌గా అంపైర్లు ప్రకటించారు.స్టోక్స్ ఈ లక్కీ సేవ్ తర్వాత 9 బౌండరీలు, ఒక సిక్సర్ కొట్టి 91 బంతుల్లో 66 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్‌ వేసిన 36వ ఓవర్‌లో అతను వరుసగా మూడు ఫోర్లు ఆఫ్-స్పిన్నర్ నాథన్ లియాన్‌ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ కీలకమైన రన్స్ తో నాలుగో టెస్ట్ థ్రిల్లింగ్ డ్రాగా ముగిసింది. ఇప్పటికే ఇంగ్లాండ్ మొదటి 3 టెస్టులో గెలవగా.. నాలుగో టెస్టు డ్రాగా ముగియగా.. ఇంకొక టెస్టు మిగిలింది. ఐదో టెస్టు జనవరి 14 నుంచి 18 వరకు జరగనుంది.
Published by:Veera Babu
First published:

Tags: Cricket

తదుపరి వార్తలు