హోమ్ /వార్తలు /క్రీడలు /

WTC Final : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్.. టీమ్ ఇండియా తుది జట్టులో మార్పులు జరిగాయా?

WTC Final : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్.. టీమ్ ఇండియా తుది జట్టులో మార్పులు జరిగాయా?

టాస్ గెలిచి బౌలింగ్ చేయనున్న న్యూజీలాండ్.. తుది జట్టులో ఎవరెవరు?

టాస్ గెలిచి బౌలింగ్ చేయనున్న న్యూజీలాండ్.. తుది జట్టులో ఎవరెవరు?

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మ్యాచ్ ఎట్టకేలకు రెండో రోజు ప్రారంభం కానున్నది. టాస్ గెల్చిన న్యూజీలాండ్ బౌలింగ్ ఎంచుకున్నది.

  ఐసీసీ (ICC) అరంగేట్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) (WTC) ఫైనల్ తొలి రోజు వర్షం కారణంగా పూర్తిగా రద్దయిన విషయం తెలిసిందే. న్యూజీలాండ్(New Zealand), ఇండియా (India) మధ్య సౌతాంప్టన్‌లో శుక్రవారం ప్రారంభం కావల్సిన ఫైనల్ మ్యాచ్ వరుణుడి దెబ్బకు తుచిపెట్టుకొని పోయింది. మిగిలిన రోజుల్లో కూడా అక్కడ వర్షం పడుతుందని అందరూ భావించడంతో కనీసం శనివారం అయినా మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఉదయం నుంచి వర్షం లేకపోవడంతో గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్దం చేవారు. తొలి రోజు ఆట రద్దు కావడంతో అరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభించారు. టాస్ గెలిచిన న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. ప్రస్తుతం సౌతాంప్టన్‌లో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బౌలింగ్ చేయాలని భావిస్తున్నట్లు కేన్ చెప్పాడు. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని అనుకుంటున్నానని కేన్ చెప్పాడు. ఇక వరుసగా టాస్‌లు ఓడిపోయే కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఆనవాయితీ కొనసాగించారు. టాస్ గెలిస్తే మేము కూడా బౌలింగ్ తీసుకోవాలని భావించినట్లు కోహ్లీ చెప్పాడు. అయితే ఇప్పుడు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉన్నది కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు.

  టీమ్ ఇండియా రెండు రోజుల క్రితమే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే తుది జట్టును ప్రకటించింది. వాతావరణంలో పూర్తిగా మార్పులు జరగడంతో తుది జట్టును కూడా మారుస్తారేమో అని భావించారు. కానీ అప్పుడు ప్రకటించిన జట్టునే కంటిన్యూ చేయనున్నట్లు కోహ్లీ చెప్పాడు.


  న్యూజీలాండ్ తుది జట్టు లో దాదాపు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడిన జట్టునే దింపారు. ట్రెంట్ బౌల్డ్‌కు జట్టులోకి తిరిగి చేరాడు.

  Published by:John Kora
  First published:

  Tags: Cricket, India vs newzealand, Kane Williamson, Team India, Virat kohli, WTC Final

  ఉత్తమ కథలు