NZ vs SL: న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి లంక విలవిల... 136 పరుగులకే లంక ఆలౌట్...

NZ vs SL: హాఫ్ సెంచరీతో దిముత్ కరుణ రత్నే ఒంటరిపోరాటం... కివీస్ బౌలర్ల జోరు ముందు నిలబడలేకపోయిన లంక బ్యాట్స్‌మెన్... ముగ్గురు డకౌట్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: June 1, 2019, 6:19 PM IST
NZ vs SL: న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి లంక విలవిల... 136 పరుగులకే లంక ఆలౌట్...
వికెట్ తీసిన ఆనందంలో కివీస్ జట్టు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: June 1, 2019, 6:19 PM IST
New Zealand vs Sri Lanka Live Score, ICC World Cup 2019 Cricket Match at Cardiff: ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 29.2 ఓవర్లలోనే 136 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కొన్నాళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న శ్రీలంక జట్టు... నిరాశజనిత ప్రదర్శనతోనే వరల్డ్‌కప్‌ 2019ను ఆరంభించింది. వరల్డ్‌కప్ వామప్ మ్యాచ్‌లో టీమిండియాకు చుక్కలు చూపించిన న్యూజిలాండ్ బౌలర్లు... శ్రీలంక జట్టును ఓ ఆటాడుకున్నారు. ఆరంభం నుంచి వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ లంక జట్టు కోలుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. మొదటి బంతికి ఫోర్ కొట్టిన ఓపెనర్ లహీరు తిరిమన్నే... రెండో బంతికి పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూకి వెళ్లిన కివీస్ కెప్టెన్‌కు అనుకూలంగా ఫలితం వచ్చింది. ఆ తర్వాత కుశాల్ పెరేరా, కరుణరత్నే కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే 29 పరుగులు చేసిన పెరేరాను అవుట్ చేసిన మ్యాట్ హెన్రీ... కుశాల్ మెండీస్‌ను డకౌట్ చేశాడు. దనంజయ డి సిల్వా 4 పరుగులు చేయగా, ఏంజిలో మ్యాథ్యూస్ 9 బంతులాడి డకౌట్ అయ్యాడు. జీవన్ మెండీస్ 1 పరుగుకే పెవిలియన్ చేరడంతో 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది శ్రీలంక. ఈ దశలో తిసార పెరేరాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు కరుణరత్నే. ఏడో వికెట్‌కు 62 పరుగులు జోడించిన తర్వాత సాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పెరేరా... 27 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇసూరు ఉదన డకౌట్ కాగా, సురంగ లక్మల్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓ వైపు వరుస వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన దిముత్ కరుణరత్నే... 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఫర్గూసన్ బౌలింగ్‌లో మలింగ్ క్లీన్‌బౌల్డ్ కావడంతో 136 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది.

మ్యాట్ హెన్రీ, లూకీ ఫర్గూసన్‌లకు మూడేసి వికెట్లు దక్కగా, మిచెట్ సాంట్నర్‌, కోలిన్ డి గ్రాండ్‌హోమ్‌, జేమ్స్ నిశమ్‌, ట్రెంట్ బౌల్ట్‌లకు తలా ఓ వికెట్ దక్కాయి.

First published: June 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...