Ind vs NZ: కోహ్లీ సేనకు షాక్...టీమ్ మేట్స్ అందరికీ మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత...

టీమిండియా ప్లేయర్లకు ICC భారీ జరిమానా విధించింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: February 5, 2020, 10:55 PM IST
Ind vs NZ: కోహ్లీ సేనకు షాక్...టీమ్ మేట్స్ అందరికీ మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత...
టీం ఇండియా
  • Share this:
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా పడింది. నిర్ణీత సమయానికి టీమిండియా 4 ఓవర్లు ఆలస్యమైనట్టు రిఫరీ క్రిస్ బ్రాడ్ గుర్తించారు. ఫలితంగా టీమిండియా ప్లేయర్లకు ICC భారీ జరిమానా విధించింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే టీ20 సిరీస్ లో సైతం చివరి రెండు మ్యాచ్‌లలో స్లో ఓవర్ రేట్ కారణంగా, నాలుగో T20 మ్యాచ్ లో 40 శాతం, ఐదో T20లో 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది.స్లో ఓవర్ రేట్‌ తప్పిదాన్ని కెప్టెన్ కోహ్లీ అంగీకరించడంతో ఆ అంశంపై విచారణ ఉండబోదని ఐసీసీ పేర్కొంది.
First published: February 5, 2020, 10:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading