• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • NEW ZEALAND VS AUSTRALIA MARTIN GUPTILL BREAK ROHIT SHARMA TO RECORD MOST SIXES IN T20 SA

ఆసలైన టీ20 మాజా.. 7 ఓవర్లలో 107 పరుగులు!

ఆసలైన టీ20 మాజా.. 7 ఓవర్లలో 107 పరుగులు!

Martin Guptill

రెండో టి20లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో కీవీస్ 2–0తో ఆధిక్యంలో నిలిచింది. మెుదటిగా బ్యాటింగ్ చేసిన కివీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది

  • Share this:
    రెండో టి20లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో కీవీస్ 2–0తో ఆధిక్యంలో నిలిచింది. మెుదటిగా బ్యాటింగ్ చేసిన కివీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (50 బంతుల్లో 97; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) కేన్‌ విలియమ్సన్‌ (35 బంతుల్లో 53; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జిమ్మీ నీషమ్‌(45) హిట్టింగ్ బ్యాటింగ్ కారణంగా ఆసీస్ ముందు కీవీస్ భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. అనంతరం ఛేదన అరంభించిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 215 పరుగులు చేసింది. ఆసీస్ ఓడినప్పటికి గెలుపు కోసం పోరాడిన తీరు అందర్ని ఆకట్టుకుంటుంది.

    చివరి 7 ఓవర్లలో ఆసీస్ 107 పరుగులు కావాల్సి ఉండగా.. స్టొయినిస్‌ (37 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), డాన్‌ స్యామ్స్‌ (15 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బౌండరీలు,సిక్సర్లతో చేలరేగి 40 బంతుల్లోనే 92 పరుగులు సాధించారు. ఇక చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. వీరిద్దరు అనుహ్యంగా పెవిలియన్ చేరగా 10 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో కీవీస్ 4 పరుగులతో విజయం సాదించింది. అయితే చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... వీరిద్దరు అవుట్‌ కావడంతో 10 పరుగులే వచ్చాయి.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు